విజయంపై కొండయ్య ధీమా

May 23,2024 23:03 ##Chirala #TDP #Kondaiah

ప్రజాశక్తి – చీరాల
ఎన్నికల్లో టిడిపి విజయం సాధిస్తుందని టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి ఎంఎం కొండయ్య ధీమా వ్యక్తం చేశారు. స్థానిక టిడిపి కార్యాలయంలో ముఖ్యనేతలతో సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. పోలింగ్‌ సరళిపై గ్రామాల వారీగా వివరాలు తెలుసుకున్నారు. టిడిపి విజయం కోసం సమిష్టిగా కృషి చేసిన నాయకులు, కార్యకర్తలను అభినందించారు. ఓట్ల లెక్కింపు అనంతరం చేపట్టబోయే కార్యాచరణ చర్చించారు. కార్యక్రమంలో మాజీ జెడ్‌పిటిసి గుద్దండి చంద్రమౌళి, కౌన్సిలర్ సూరగాని లక్ష్మి, నరసింహారావు, కొత్తపేట మాజీ ఉపసర్పంచి కౌతరపు జనార్దనరావు, బుర్లవారిపాలెం మాజీ ఉపసర్పంచి గవిని నారాయణ, అక్కాయపాలెం మాజీ సర్పంచి జంగిలి రామారావు, గుర్రం వెంకటేశ్వర్లు, వెంగళ భరత్, సజ్జ వెంకట సుబ్బారావు, పృథ్వి సాంబశివరావు, అవ్వారు సాంబయ్య, తేలపోలు నాగేశ్వరావు, నిమ్మల పిచ్చియ్య పాల్గొన్నారు.

➡️