పంటలు పరిశీలిస్తున్న కృష్ణ చైతన్య

Dec 7,2023 23:40

ప్రజాశక్తి – సంతమాగులూరు
తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాని వైసీపీ ఇన్‌చార్జి బాచిన కృష్ణ చైతన్య అన్నారు. మండలంలోని కొమ్మాలపాడు, మక్కెనవారిపాలెం, ఏల్చూరు, సజ్జాపురం గ్రామాలలో వర్షానికి దెబ్బతిన్న మిర్చి, వరి, అరటి, మొక్కజొన్న పంటలను అధికారులతో కలిసి పరిశీలించారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా రైతులకు ప్రభుత్వం నుండి రావలసిన పంట నష్ట పరిహారం అందే విధంగా సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెపపారు. కార్యక్రమంలో కొమ్మాలపాడు సర్పంచి మోతాదు మహబూబ్ జానీ, ఖాదర్ మస్తాన్, జడ్పిటిసి అడవి శ్రీనివాసరావు, వైసీపీ మండల కన్వీనర్ చింతా రామారావు, డి గాలెయ్య పాల్గొన్నారు.
సంతమాగులూరు : మండలంలోని ఏల్చూరు గ్రామంలోని ఎస్టీ కుటుంబాలకు ఇండ్ల స్థలం పట్టాలు సిద్ధం చేయాలని తహశీల్దారు టీ ప్రశాంతిని వైసీపీ ఇన్‌చార్జి బాచిన కృష్ణ చైతన్య ఆదేశించారు. గ్రామంలో నివాసం ఉంటున్న 60ఎస్టీ కుటుంబాలను ఆయన గురువారం పరామర్శించారు. మిచౌంగ్ తుఫాన్ దాటికి వర్షపు నీరు చేరి గుడిసెలు కూలిపోవడంతో ఆ కుటుంబాలు అనాధలుగా మిగిలారు. గ్రామానికి చెందిన హెల్పింగ్ హాండ్స్ సంస్థ సభ్యులు బాధితులకు దుస్తులు, ఆహారం అందించారు. పట్టాలి ఇచ్చిన వెంటనే పక్కా గృహాలు కూడా కట్టిచ్చిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మాజీ సొసైటీ అధ్యక్షులు డి గాలెయ్య, బండారు సాంబయ్య బాధితులకు ఏర్పాటు చేసిన భోజనాలను వడ్డించారు. కార్యక్రమంలో తహశీల్దారు టీ ప్రశాంతి, జడ్పిటిసి అడవి శ్రీనివాసరావు, వైసీపీ మండల కన్వీనర్ చింతా రామారావు పాల్గొన్నారు.

➡️