కూరపాటి సంస్మరణ సభ

May 26,2024 22:29 ##Vetapalem #Rotary

ప్రజాశక్తి వేటపాలెం
విద్యార్థులను చిత్రకారులుగా తీర్చిదిద్దిన ఘనత కూరపాటి వెంకట్రావుకు దక్కుతుందని పలువురు వక్తలు కొనియాడారు. స్థానిక ఓఆర్ఎస్ పాఠశాల్లో కూరపాటి వెంకట్రావు సంస్కరణ సభ ఆదివారం నిర్వహించారు. సభకు పందిళ్ళపల్లి జెడ్‌పి హై స్కూల్ హెచ్‌ఎం బట్టిప్రోలు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ బాల, బాలికలను చిత్రకారులుగా తీర్చి దిద్దటంలో అవిశ్రాంతంగా పని చేశారన్నారు. చిత్రకారులు పద్మారావు మాట్లాడుతూ చిత్రలేఖనం ఉపాద్యాయునిగా కొనసాగినప్పటికీ కల్పనా ఆర్ట్స్ అధినేతగా అనేక చిత్రాలు చిత్రించారని అన్నారు. కూరపాటి వెంకటరావు మరణం తీరని లోటని, ఆయన సేవలు మరువలేనివని గుర్తు చేసుకున్నారు. గత వారం రోజుల నుండి ప్రశాంతరెడ్డి పంచ వృత్తుల బావ ప్రకటన వేదిక ఆధ్వర్యంలో చిన్నారులకు మనోవికాస తరగతుల్లో భాగంగా మాట్లాడారు. కార్యక్రమంలో సిహెచ్ యల్లమందారెడ్డి, కూరపాటి నారాయణ, కర్న బాలానందం, ఓఆర్ఎస్ స్కూల్ ఉపాద్యాయులు కోడే శ్రీనివాసరావు, పింజుల శ్రీనివాసరావు, పందిళ్లపల్లి జెడ్‌పి హైస్కూల్ ఉపాద్యాయులు, చిత్రలేఖనం కళాకారులు శేఖర్ ఆర్ట్స్ పాల్గొన్నారు.

➡️