డివైడర్లు తొలగింపుతో ప్రజాధనం దుర్వినియోగం

Feb 28,2024 23:42

ప్రజాశక్తి – బాపట్ల
పట్టణంలో అవసరం లేకపోయినా ఉన్న డివైడర్లు తొలగించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని టిడిపి ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్ర వర్మ ఆరోపించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో బుదవారం ఏర్పాటు చేసిన విలేఖలు సమావేశంలో ఆయన మాట్లాడారు. రహదారి విస్తరణలో రివైడర్లను తొలగించినప్పటికి మార్పు ఏమి లేదని అన్నారు. ఉన్న వాటిని తొలగించి కొత్త డివైడర్లు నిర్మాణంతో ప్రజా ప్రజాధనం దుర్వినియోగం తప్ప ప్రజలకు ప్రయోజనం లేదన్నారు. పురపాలక సంఘం ఇంజనీరింగ్ విభాగం వైఫల్యం వల్లే పైపులైన్‌ పగిలిపోయిందని అన్నారు. ప్రధాన రహదారిపై నీటి పైపులు మరమ్మత్తులు చేయ కుండా వాటిపై రోడ్లు వేయడంతో పగిలిపోయిన పైపుల ద్వారా వాటర్ లీక్ అవుతూ ఉందని అన్నారు. ఉదయం 6 గంటల సమయంలో రోడ్లపై నీరు ప్రవహిస్తుందని అన్నారు. కళ్ళముందు కనిపిస్తున్న లీకులను నివారించాల్సిన పురపాలక సంఘం అధికారులు, పాలకులపై లేదాని ప్రశ్నించారు. శ్రీనివాస నగర్ కాలనీ వద్ద గత 40ఏళ్ల నుంచి డివైడర్లు మధ్య రోడ్డ క్రాసింగ్ ఉంది. ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న డివైడర్లతో దారి లేకుండా చేశారని అన్నారు. శ్రీనివాస నగర్ కాలనీలోకి వెళ్లేందుకు డివైడర్ల మధ్య దారి లేకుండా చేయడం రాజకీయ కుట్రే నన్నారు. పాత డివైడర్లు తొలగింపుతో వచ్చిన ఇతర రద్దును వైసిపి పట్టణ అధ్యక్షుడు కాగిత సుధీర్ బాబు జగనన్న కాలనీ వద్ద ఆయన స్థలంలో పూడిక నింపుకునేందుకు వాడుకున్నారని అన్నారు. అదే మట్టిని జగనన్న కాలనీలో పల్లపు ప్రాంతానికి తరలించొచ్చు కదాని అన్నారు. ఎంఎల్‌ఎ కోన రఘుపతి అవినీతి తారా స్థాయికి చేరిందని అన్నారు. కోన అవినీతి అక్రమాలను ప్రజలు ప్రశ్నించలేని స్థితిలో లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా రఘుపతిని ఘోరంగా ఓడిస్తారని అన్నారు. సమావేశంలో దయా బాబు, తోట నారాయణ, గొలపల శ్రీనివాసరావు, గొల్లపాలెం వెంకటేశ్వర్లు, షాకా పాల్గొన్నారు.

➡️