సంతలో డబ్బు ఇస్తేనే అమ్మకాలు

Feb 4,2024 22:23

ప్రజాశక్తి – అద్దంకి
పట్టణంలోని రాంనగర్ మార్కెట్ యార్డ్ ఆవరణలో గత పదేళ్లుగా అన్నగారి సంతలో రైతులు పండించిన పంటలను దళారీ వ్యవస్థకు స్వస్తి చెప్పి నేరుగా ఆదివారం సంత నిర్వహిస్తున్న విషయం తెలిసినదే. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా యధావిధిగా సంత నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో అధికార వైసిపికి ఇంచార్జి మారడంతో ఒక్కసారిగా అధికార పార్టీ నాయకుని అండదండలతో నాయకులు ఆదివారం సంతలో డబ్బులు ఇస్తున్నారు. రైతులు పండించిన పంటలను అమ్ముకోవాలంటే సంతకు శిస్తు రుసుం చెల్లించాలని హుకుంను జారీ చేసి వసూళ్లు చేస్తున్నారు. యధా విధిగా మార్కెట్ యార్డుకు తమ కూరగాయలను అమ్మకాలు జరుపుకోవడానికి వచ్చిన రైతులను బెదిరించినట్లు అధికార పార్టీ నాయకులు మాట్లాడడంతో రైతులు చేసేదేమి లేక రుసుం చెల్లించక తప్పని పరిస్థితి నెలకొన్నది. ఈ దోపిడీ వ్యవస్థను అధికార పార్టీ మానుకోవాలని రైతులు కోరుతున్నారు.

➡️