చార్మినార్ ఎక్సప్రెస్‌లో అక్రమ మద్యం పట్టివేత

May 19,2024 22:25 ##Chirala #GRP #Police

– చీరాల స్టేషన్లో పట్టుకున్న రైల్వే పోలీసులు
– 90 మద్యం సీసాలు స్వాదినం
– తెలంగాణను నుండి ఎపికి తెస్తున్న మద్యం
ప్రజాశక్తి – చీరాల
తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కు చార్మినార్ ఎక్స్ప్రెస్‌లో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలు తెస్తున్న ఇద్దరి వ్యక్తులను చీరాల రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై రైల్వే పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. బ్యాగులు సోదా చేయగా బ్యాగులో మద్యం సీసాలు గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రైల్వే పోలీసులు మాట్లాడుతూ గుంతకల్ రైల్వే ఎస్‌పి కె చౌడేశ్వరి ఆదేశాలు మేరకు నెల్లూరు రైల్వే డిఎస్‌పి సిహెచ్ విజయ భాస్కర్ సూచనలు ప్రకారం ఒంగోలు జిఆర్‌పి సిఐ ఆద్వర్యంలో చీరాల జిఆర్పి ఎస్ఐ సిహెచ్ కొండయ్య, ఆర్‌పిఎఫ్ సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్లో ముమ్మర తనికీలు చేస్తున్నారు. పట్టణంలోని మరియమ్మపేటకు చెందిన కొడాలి రాఘవ, కారంచేడుకు చెందిన కనికమళ్ళ చిన్నబాబు ఇరువురు తెలంగాణ నుండి అక్రమంగా చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మ్యాన్షన్ హౌస్ బ్రాంది 99 క్వార్టర్ బాటిల్స్ తీసుకొస్తూ ప్లాట్ ఫారం 3 వద్ద అనుమానస్పదంగా కనిపించారని ఎస్‌ఐ కొండయ్య తెలిపారు. దింతో తమ సిబ్బంది, ఆర్‌పిఎఫ్ సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 90మద్యం సిసాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరచినట్లు తెలిపారు. మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ముఠాలను వెలికితీయడంలో జిఆర్‌పి, ఆర్‌పిఎఫ్‌ ప్రత్యేక బృంధాల సహాయంతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, ఒంగోలు రైల్వే స్టేషన్ల పరిధిలో తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నట్లు తెలిపారు.

➡️