దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

Feb 19,2024 15:28 #Bapatla District
The attackers should be severely punished

ప్రజాశక్తి – మార్టూరు రూరల్ : నిజాలను నిర్భయంగా వెలికితీసే జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మార్టూరు – యద్దనపూడి జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు నల్లపనేనికి రామారావు, ఉపాధ్యక్షులు కుడారి రాజకుమార్, షేక్ మహమ్మద్ షఫీ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు లో ఆదివారం జరిగిన బహిరంగ సభ ప్రాంగణంలో ఒక ఛానల్ ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన నేపథ్యంలో జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులూ మార్టూరు అర్బన్ సిఐ ఎస్వీ రాజశేఖర్ రెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఒక ప్రక్క ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సభలో వేలాదిమంది పోలీసులు,ప్రభుత్వ నిఘా సంస్థల సమక్షంలో ఫోటో జర్నలిస్టుపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచటం దారుణమని అన్నారు. జర్నలిస్టులపై దాడి చేసిన వారికి 5 సంవత్సరాల కఠిన శిక్ష విధించడం జరుగుతుందని ఇటీవల సుప్రీంకోర్టు ఒక కేసులో చెప్పడం జరిగిందని, ఈ ఘటనను ప్రజాస్వామ్యులంతా తీవ్రంగా ఖండించాలని కోరారు. దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.  ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్తానని సిఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

➡️