ఇసుక రీచ్ లను పరిశీలించిన కలెక్టర్

May 20,2024 12:21 #Bapatla District

ప్రజాశక్తి-కొల్లూరు : వేమూరి నియోజకవర్గ భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో గల కృష్ణానది ఇసుక రీచ్ లను సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, ఎస్పీ వకుల్ జిందాల్ మైనింగ్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వ పాలల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టిన వైనాన్ని ఇటీవల వేమూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పలు అంశాలతో వివరిస్తూ ఆరోపించారు. ఈ ఆరోపణ దృష్ట్యా కలెక్టర్ ఎస్పీ మైనింగ్ అధికారులతో కలిసి జువ్వలపాలెం, ఈపూరు, ఓలేరు తదితర గ్రామాల్లో రీచ్ లను తనిఖీ చేశారు.

➡️