అరాచక శక్తులపై జనసైనికుల యుద్ధం

Mar 8,2024 00:17

ప్రజాశక్తి – రేపల్లె
అరాచక శక్తులపై పోరాడేందుకు జనసైనికులు సిద్ధంగా ఉన్నారని జనసేన పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి మంగళగిరి జనసేన కార్యాలయం సమీపంలోని అపార్ట్మెంట్లో పోలీసులు సోదా చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. స్థానిక జనసేన కార్యాలయంలో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలను భయభ్రాంతులకు గురి చేసేందుకు పోలీసులను అడ్డు పట్టుకోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రతిపక్షాలను ఎదుర్కొనలేక పోలీసులతో దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. పోలీసులు చట్టబద్దంగా పనిచేయాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని టిడిపి, జనసేన సైనికులు వైసీపీ అరాచక పాలనపై యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు. అధికారం శాశ్వతం కాదని అన్నారు. అధికారం పోతే మీ పరిస్థితి ఏంటని వైసిపిని ప్రశ్నించారు. 2014లో టిడిపి, జనసేన ఉమ్మడి ప్రభుత్వం సమయంలో పాదయాత్ర చేసిన జగన్మోహన్‌రెడ్డి ప్రజల మన్ననలు పొందారని, ఈ రోజు రాక్షసపాలన సాగిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తుటంతో ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అన్నారు. వైసిపి బెదిరింపులను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. పోలీసు రాజ్యం ఎంతో కాలం సాగదని అన్నారు. టిడిపి, జనసేన ఆధ్వర్యంలో రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తామని దీమా వ్యక్తం చేశారు. రాక్షస పాలనను అంతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టిడిపి, జనసేన కార్యాలయాలపై, కార్యకర్తలపై దాడులకు పాల్పడటం చేతగాని తనానికి నిదర్శనం అన్నారు. త్వరలో వైసిపి పాలనకు చమర గీతం పాడి టిడిపి, జనసేన ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు.

➡️