వెంకటరత్నమ్మ బాధ్యతల స్వీకరణ

Feb 8,2024 22:57

ప్రజాశక్తి – పంగులూరు
మండలంలోని జాగర్లమూడి వారిపాలెం పిఎసిఎస్ నూతన చైర్ పర్సన్‌గా జాగర్లమూడి వారిపాలెం గ్రామానికి చెందిన జాగర్లమూడి వెంకటరత్నమ్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గత జనవరి 31తో పాత పాలక వర్గానికి గడువు ముగియడంతో కొత్త పాలకవర్గంను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చైర్ పర్సన్ వెంకటరత్నమ్మతో పాటు సభ్యులుగా పూసల హనుమంతరావు, బండి ఓబుల్‌రెడ్డిని నియమించారు. వీరికి వైసిపి ఇన్చార్జి పానెం చిన హనీమిరెడ్డి సోదరుడు నరసింహారెడ్డి, వైసిపి మండల ఇంచార్జ్ శ్రీనివాసరెడ్డి ముప్పవరంలోని సొసైటీ కార్యాలయంలో బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, సొసైటీ మాజీ అధ్యక్షులు జాగర్లమూడి ఎల్లమందరావు, ముప్పవరం సర్పంచ్ రౌతు సాంబశివరావు, ఎంపీటీసీ పూసల గంగాధర్ పాల్గొన్నారు.

➡️