దెబ్బతిన్న ప్రతి గింజ కొంటాం : మోపిదేవి

Dec 7,2023 00:31

ప్రజాశక్తి – రేపల్లె
తుపాను వల్ల నష్టపోయిన ప్రతి గింజ ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు చెప్పారు. నేలకొరిగిన పంట పొలాలను బుధవారం పరిశీలించారు. రైతులకు ఎలాంటి నష్టం లేకుండా అన్ని విధాలుగా ఆదుకోవాలని సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. పంట నష్టం అంచనాల్లో రాజకీయాలకు తావులేకుండా జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వెంటనే ఎన్యూమరేషన్ ప్రారంభించాలని చెప్పారు. రైతులు మనోధైర్యంతో ఉండాలని అన్నారు. తుపాను నష్ట తీవ్రతను తగ్గించేందుకు సీఎం ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహించి, అప్రమత్తం చేశారని అన్నారు. నిధులు విడుదల చేసి, ముందస్తు సహాయక చర్య లను ముమ్మరం చేశారని తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ సుధాహాసన్, వైస్ ఎంపీపీ రావు నెహ్రూ లక్ష్మి ప్రభాకరరావు, వైసిపి అధ్యక్షులు మండలి అంజయ్య, పెనుమూడి సర్పంచ్ దారం విజయ్, కనపర్తి రవికిరణ ఉన్నారు.


రేపల్లె : లోతట్టు ప్రాంతాల ప్రజలను తహశీల్దారు మల్లికార్జునరావు ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం 2రోజులు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పట్టణంలో 23వ వార్డులోని లాల్ బహుదూర్ మున్సిపల్ ప్రాధమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన సహాయక శిబిరంను ఎంపి మోపిదేవి వెంకటరమణారావు సందర్శించారు. కేంద్రాల్లో ఉన్న 240మందికి కావలిసిన 25కిలోల బియ్యం, రూ.2500ఆర్ధిక సహాయం, కూరగాయలు, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్స్ పంపిణి చేశారు. వసతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం సహాయక చర్యలను చేసిందని అన్నారు. వాలంటీర్‌ దగ్గర నుంచి ఉద్యోగులు అందరూ పనిచేశారని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కట్టా మంగా, వైస్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ విశ్వనాథ గుప్తా, కమిషనర్ బి విజయ సారథి, తులసి దుర్గాప్రసాద్, లోయ బాబు, నాంచారయ్య, బేతపూడి కోటేశ్వరరావు పాల్గొన్నారు.


నగరం : పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. మండలంలోని సజ్జవారిపాలెంలో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న వరి పంట పొలాలను పరిశీలించారు. ఆరుగాలం రైతులు శ్రమకోర్చి పండించిన పంటలు దెబ్బతినటం బాధాకరమని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాన్ని పూడ్చలేమని అన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. తడిసిన, రంగుమారిన, మొలకలు వచ్చిన ధాన్యాన్ని సైతం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని సిఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. పంటల నష్టం అంచనాలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మండల ఎంపీపీ చింతల శ్రీ కృష్ణయ్య, ఎఒ వి రమేష్ బాబు, చైర్మన్ టి అనిల్ కుమార్, వైసీపీ జిల్లా కార్యదర్శి నిజాంపట్నం కోటేశ్వరరావు, ఈదులమ్మ దేవస్థానం చైర్మన్ చింతల హరిప్రసాద్ పాల్గొన్నారు.

➡️