విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

Jun 27,2024 00:39 #Note books distribution
Note Books distribution

 ప్రజాశక్తి -గాజువాక, మధురవాడ : శ్రీ దుర్గా శ్రీనివాస ఫ్యాబ్రికేషన్‌ అధినేత జాగరపు శ్రీను బుధవారం ఇద్దరు విద్యార్థినులకు పుస్తకాలు, స్కూల్‌ బ్యాగులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ సంస్థ ద్వారా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. చదువుకు అవసరమయ్యే పుస్తకాలను తమ సంస్థ ద్వారా ఏటా ఇద్దరికి అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట్ల వినోద్‌, తోకాడు శీను, జాగరపు ముసలయ్య, జగ్గయ్య, సాయి, తోకాడ ప్రసాద్‌, సుధమల్ల వెంకట్రావు పాల్గొన్నారు. మధురవాడ : జివిఎంసి ఐదో వార్డు పరిధి బొట్టవానిపాలెం, శివశక్తినగర్‌, బోరవానిపాలెం ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం పుస్తకాలు, స్కూల్‌ బ్యాగులను టిడిపి నాయకులు మొల్లి లక్ష్మణరావు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాల కార్మికులను గుర్తించి బడిలో చేర్పించాలని ఉపాధ్యాయులను కోరారు. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో చొరవ చూపి పిల్లలందరూ పాఠశాలకు వెళ్లే విధంగా శ్రద్ధ చూపాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు వాంద్రాసి అప్పలరాజు, బోయి వెంకటరమణ, బోయి రమాదేవి, ఈగల రవికుమార్‌, సరస్వతి పాల్గొన్నారు.

➡️