రక్తదానంలో యువతకు భగవాన్ ఆదర్శ : జేసు ప్రసాదు

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా):రక్తదానం చేయడంలో యువతకు భగవాన్ ఆదర్శమని ప్రభుత్వాసుపత్రి ఐసిటిసి మెడికల్ కౌన్సిలర్ జే జేసు ప్రసాద్ అన్నారు. శనివారం నర్సాపురం ప్రభుత్వాసుపత్రిలో ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో జేసు ప్రసాద్ సమక్షంలో నర్సాపురం పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఆదరణ ట్రస్ట్ చైర్మన్ బొడ్డు కృష్ణ భగవాన్ 71 వ సారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జేసు ప్రసాద్ మాట్లాడుతూ ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడేందుకు ఆరోగ్య వంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి భగవాన్ రక్తదానం చేయడం అలవాటుగా చేసుకోవడం అభినందనీయం అన్నారు. 71 మంది జీవితాల్లో రక్తదానంతో భగవాన్ వెలుగులు నింపాడని అన్నారు. భగవంతుడు మరింత ఆరోగ్యాన్ని భగవాన్ కి అందించాలని, తద్వారా ఆపదలో ఉన్న మరికొంతమందిని రక్తదానంతో కాపాడాలని జేసు ప్రసాద్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు నరసాపురం శాఖ ప్రతినిధులు వికాస్, మహేష్ లు ఉన్నారు.

➡️