వేట నిషేధ సమయంలో భ్రుతి 30వేలు ఇవ్వాలి-మోకా చిన శ్రీనివాస్‌

Apr 16,2024 16:20 #narsapuram

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా):వేటనిషేద సమయంలో సముద్ర వేట మత్స్యకారులకు భ్రుతి 30 వేలు ఇవ్వాలని నియోజకవర్గ వర్గ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మోకా చిన శ్రీనివాస్‌ అన్నారు. మత్స్యకారులకు భఅతి పెంచాలని మంగళవారం పట్టణంలోని మత్స్య శాఖ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ 61 రోజులు వేట నిషేధ సమయంలో అందించే జీవన భ్రుతి సరిపోవడం లేదన్నారు.నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో వారి జీవన వ్యయం కూడా పెరిగిందని, దీనితో మత్స్యకారుల బతుకు బండి కష్టమైంపోతుందన్నారు. ప్రభుత్వం స్పందించి నెలకు 15 వేలు చొప్పున ,రెండు నెలలకు భఅతి 30వేలు అందిచాలని కోరారు. ఈమేరకు వినతిపత్రాన్ని ఫీల్డ్‌ మేనేజర్‌ ఎ. నాగేశ్వరరావు కి అందచేశారు. ఈకార్యక్రమంలో నాయకులు సోడదాసి శ్రీధర్‌, ప్రభాకర్‌, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

➡️