గంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం

ప్రజాశక్తి-సంతనూతలపాడు: స్థానిక శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం గత మూడు రోజులుగా జరుగుతోంది. మూడో రోజైన శనివారం నిర్వహించిన శిబిరంలో ఎంఈఓ-2 వెంకారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు పుస్తక పఠనం, కథలు చదివించటం, కథలు చెప్పించటం లాంటివి నిర్వహించారు. అనంతరం పిల్లలతో చెస్‌ ఆటలు ఆడించారు. శిబిరానికి వచ్చిన విద్యార్థులు ఆనందంగా గడిపారు. ఈ శిబిరంలో 8 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తరువాత పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను సమ్మర్‌ క్యాంప్‌ క్లాసులకు పంపించి వారి అభివృద్ధికి సహకరించాలని గ్రంథపాలకుడు కే సత్యనారాయణ కోరారు.

➡️