మన్యంలో బోణీ

Apr 18,2024 22:02

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌  : పార్వతీపురం మన్యంజిల్లాలో తొలిరోజు గురువారం ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలైంది. అరకు పార్లమెంట్‌ స్థానానికి ఒక్క నామినేషన్‌ కూడా ఎవరూ వేయలేదు. నాలుగు అసెంబ్లీస్థానాలకు గాను కురుపాంలో స్వతంత్ర అభ్యర్థిగా నిమ్మక జయరాజు నామినేషన్‌ వేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ను సీతంపేట ఐటిడిఎ పిఒ, పాలకొండ ఆర్‌ఒ కల్పనాకుమారి, పార్వతీపురం ఐటిడిఎ పిఒ, సాలూరు ఆర్‌ఒ సి.విష్ణు చరణ్‌, పార్వతీపురం ఆర్‌డిఒ, ఎన్నికల ఆర్‌ఒ అధికారి కె.హేమలత, పాలకొండ ఆర్‌డిఒ, కురుపాం ఆర్‌ఒ వి.వెంకట రమణ తమ నియోజకవర్గాల్లో విడుదల చేశారు. ఈసందర్బంగా ఎన్నికల నోటిఫికేషన్‌ వివరాలను రిటర్నింగ్‌ అధికారి కార్యాలయ నోటీస్‌ బోర్డులో పొందుపరిచారు.కురుపాం : నామినేషన్లు మొదటి రోజు కురుపాం నియోజకవర్గంలో నిమ్మక జయరాజు స్వతంత్ర అభ్యర్ది గా ఒక సెట్‌ నామినేషన్‌ గురువారం దాఖలు చేసినట్టు కురుపాం నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి వి. వి. రమణ తెలిపారు.నేడు రాజన్నదొర సాధారణంగా దాఖలుసాలూరు : అసెంబ్లీ, సాధారణ ఎన్నికల సమరంలో తొలి ఘట్టం గురువారం ప్రారంభమైంది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సి.విష్ణుచరణ్‌ దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ ను విడుదల చేశారు తొలిరోజు ప్రధాన పార్టీల అభ్యర్థులెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. అభ్యర్థులు వారి జాతకాలు, ముహూ ర్తాల ఆధారంగా నామినేషన్‌ దాఖలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా డిప్యూటీ సిఎం రాజన్నదొర వైసిపి అభ్యర్థిగా ఈనెల 19న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. రెండోసారి 24న భారీ జనసమీకరణతో కలిసి నామినేషన్‌ దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టిడిపి అభ్యర్థి సంధ్యారాణి కూడా 20న తొలివిడత నామినేషన్‌ సాదాసీదాగా దాఖలు చేయనున్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు నామినేషన్‌ దాఖలు ప్రక్రియ ప్రారంభం కావడంతో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద పటిష్ట పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ డిఎస్‌పి మురళీధర్‌ ఆధ్వర్యాన ముగ్గురు సిఐలు విహెచ్‌.వాసు నాయుడు, బాలకృష్ణ, నారాయణరావు నాయకత్వం లో పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. ఆర్వో కార్యాలయానికి 500 మీటర్ల దూరంలో ఉన్న దుకాణాలు మూసివేయాలని పోలీసులు సంబంధించిన దుకాణ యజమానులను ఆదేశించారు. 100 మీటర్ల దూరంలో బారికేడ్లుసీతంపేట : అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వచ్చే ర్యాలీని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల దూరంలోనే ఆపివేయాలని పాలకొండ డిఎస్పీ జివి కృష్ణారావుకు ఆర్‌ఒ కల్పనకుమారి సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా పరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్వో కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి ఎస్‌ ఏ మహేశ్వరరావుసీఐ, చంద్రమౌళి ఎస్‌ఐ జగదీష్‌ నాయుడు అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.బోణీ పడలేదుపాలకొండ : నియోజకవర్గానికి సంబంధించి మొదటి రోజైన గురువారం ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. గురువారం నుంచి నామినేషన్‌ స్వీకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటికీ నామినేషన్‌ వేసేందుకు ఎవరూ రాలేదు.

➡️