భావితరాలకు ఆదర్శప్రాయుడు బిఆర్‌.అంబేద్కర్‌

ప్రజాశక్తి – కడప/ కడప అర్బన్‌ : నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ అని, ఆయన యావత్‌ ప్రపంచానికి ఆదర్శనీయం వైఎస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్‌ వి.విజరు రామరాజు అభివర్ణించారు. భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్‌.అంబేద్కర్‌ 133వ జయంతిని పురస్కరించు కొని ఆదివారం స్థానిక కలెక్టరేట్‌ ప్రాంగణంలోని బి.ఆర్‌. అంబేద్కర్‌ విగ్రహానికి కలెక్టర్‌తోపాటు జెసి గణేష్‌ కుమార్‌, డిఆర్‌ఒ గంగాధర్‌గౌడ్‌ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నవభారత నిర్మాణంలో డా. బి.ఆర్‌.అంబేద్కర్‌ పోషించిన పాత్ర విశేషమైందన్నారు. ఎస్‌పి ఆధ్వర్యంలో.. జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకల కార్యక్రమంలో ఎస్‌పి సిద్ధార్థకౌశల్‌ పాల్గొని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్‌పి (పరిపాలన ) లోసారి సుధాకర్‌, ఎఆర్‌ అదనపు ఎస్‌పి ఎస్‌.ఎస్‌. ఎస్‌.వి కష్ణారావు, ఎఆర్‌డిఎస్‌పి మురళీధర్‌, ఆర్‌లై ఆనంద్‌, శ్రీశైల రెడ్డి, టైటాస్‌, వీరేష్‌ ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు . సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో.. డిఆర్వో గంగాధర గౌడ్‌ అధ్యక్షతన డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 133వ జయంతి ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి, మైనారిటీ, ఎస్‌సి కార్పొరేషన్ల ఇడడి డా. వి.బ్రహ్మయ్య, ఆర్డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ వీరన్న, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి నాగేశ్వరరావు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఎంపీ అవినాష్‌రెడ్డి నివాళి.. కడప పార్లమెంటు అభ్యర్థి వైఎస్‌. అవినాష్‌ రెడ్డి వైసిపి ఎస్‌సి సెల్‌ జిల్లా అధ్యక్షులు వినోద్‌ కుమార్‌ ఆధ్వర్యంలో వైసిపి జిల్లా కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి, ఆర్టఇసి బస్టాండ్‌ వద్ద గల అంబేద్కర్‌ విగ్రహానిక పూలమాలవేసి నివాళులర్పించారు.పిడిఎస్‌యు ఆధ్వర్యంలో..అంబేద్కర్‌ జయంతి సందర్భంగా పిడిఎస్‌యు నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న, పిఓడబ్ల్యూ నాయకురాలు సుజాత,రాణి, మీనాక్షి, స్వాతి,శ్రీలేఖ, నవాల్‌, కాంత,ప్రభావతి, శ్రావణి, మహిత, వరలక్ష్మి, తులసి, జయ, హసీనా, శ్రీలక్ష్మి, సిపిఐ( ఎంల్‌) న్యూడెమోక్రసీ నాయకులు మోహన్‌, చందు పాల్గొన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో.. ప్రమాదంలో ఉన్న రాజ్యాంగాన్ని రక్షించడమే ఆయనకిచ్చే ఘనమైన నివాళి అని సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి అన్నారు. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని నగరంలోని ఆర్‌టిసి బస్టాండ్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు దస్తగిరి రెడ్డి, రామకష్ణారెడ్డి, చంద్రారెడ్డి, రామ్మోహన్‌, మనోహర్‌, ప్రసాద్‌, గోవిందు, దేవర పాల్గొన్నారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఎఎఫ్‌ఎయులో.. జాతీయ సేవా పథకం ఆద్వర్యంలో అంబేద్కర్‌ 133 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య ఇ.సి. సురేంద్రనాథ్‌ రెడ్డి ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్‌ రాజేష్‌ కుమార్‌ రెడ్డి, సూపరింటెండెంట్‌ వై.పవన్‌ కుమార్‌రెడ్డి, నేషనల్‌ ఈవెంట్‌ కో-ఆర్డినేటర్‌ మనోహర్‌ రావ్‌, జాతీయ సేవా పథక ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు ప్రదీప్‌ కుమార్‌, ఉదయ ప్రకాష్‌ రెడ్డి,రమాదేవి పాల్గొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో… కడప నగరంలో భారత విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బి.ఆర్‌ అంబేద్కర్‌ 134వ జయంతి వేడుకలు నిర్వహించారు.కెఎస్‌ఆర్‌ఎం, కెఎల్‌ఎం మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో..అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి విద్యార్థినులు ‘జై భీం’ అన్న నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో కళాశాల మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కే చంద్ర ఓబుల్‌ రెడ్డి, కరస్పాండెంట్‌ రాజేశ్వరి, కెఎస్‌ఆర్‌ఎం ప్రిన్సిపల్‌ విఎస్‌ఎస్‌ మూర్తి, కెఎల్‌ఎం మహిళా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం. వి. రత్నమ్మ, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ పి.ప్రేమ్‌ కుమార్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ సురేష్‌బాబు, ప్రభాకర్‌, జాన్‌ దేవానంద్‌ పాల్గొన్నారు. కార్య క్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ కార్యదర్శి సగిలి రాజేంద్ర ప్రసాద్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సోమిరెడ్డిపల్లి మనోజ్‌ కుమార్‌, సహాయ కార్యదర్శి అభినరు కుమార్‌, అఖిల్‌ పాల్గొన్నారు. ఎస్‌టియు ఆధ్వర్యంలో.. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా కడప జిల్లా కలెక్టరేట్‌లో ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి ఎస్‌టియు కడప జిల్లా శాఖ తరపున జిల్లా అధ్యక్షులు ఇలియాస్‌ బాష, కడప రీజియన్‌ కన్వీనర్‌ అబ్దుల్‌ వాజీద్‌, నగర అధ్యక్షులు సాదిక్‌ అలి, జిల్లా నాయకులు సునీల్‌ కుమార్‌, సికందర్‌, ఫకద్దిన్‌ ఘనంగా నివాళులర్పించారు. ఆపస్‌ ఆధ్వర్యంలో.. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 134 జయంతిని పురస్కరించుకుని కడప కలెక్టరేట్‌ ఆవరణలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం (ఆపస్‌) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.వెంకట్రామిరెడ్డి , జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్‌ రెడ్డి, రెడ్డయ్య, రఘు ప్రసాద్‌, శ్రీనివాసులు రెడ్డి, రమణారెడ్డి, హరినాథ్‌ రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో.. కడప కొత్త కలెక్టరేట్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోవిందు నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి యం. త్రివిక్రమ్‌ యాదవ్‌, జిల్లా ఉపాధ్యక్షులు కళ్యా సుధాకర్‌, పస్తుం అంజి, నగర ప్రధాన కార్యదర్శి పల్లా నరసింహారావు, జిల్లా కార్యదర్శి పట్టుపోగుల సుబ్బారావు, జిల్లా యాదవ సంఘ అధ్యక్షులు కావేటి ప్రతాప్‌ యాదవ్‌, ఓబులేసు యాదవ్‌ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో.. అంబేద్కర్‌ జయంతి వేడుకలను పురస్కరించుకొని అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షులు మల్లెం విజయ భాస్కర్‌, కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షులు వై విష్ణు ప్రీతం రెడ్డి డిసిసి ఉపాధ్యక్షులు ప్రసాద్‌ గౌడ్‌, వెంకటర మణారెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షులు వెంకటరమణ, మహిళ నాయకురాలు శ్యామలాదేవి, డిసిసి మైనార్టీ ఉపాధ్యక్షులు సుల్తాన్‌, సూర్యనారాయణ, హరిప్రసాద్‌, సాంబశివుడు పాల్గొ న్నారు. రాయచోటి : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బిఆర్‌.అంబేద్కర్‌ భావితరాలకు ఆదర్శప్రాయుడని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ పేర్కొన్నారు. భారతరత్న డా.బిఆర్‌. అంబేద్కర్‌ 133 వ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్‌ అభిషిక్త్‌కిషోర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బిఆర్‌.అంబేద్కర్‌ లాంటి గొప్ప వ్యక్తి భారత గడ్డపై ఉండడం ఎంతో గర్వ కారణమన్నారు. బిఆర్‌.అంబేద్కర్‌ ఇచ్చిన గొప్ప ఎనలేని సంపద రాజ్యాంగం వల్లనే మనమంతా ప్రజాస్వామ్యంలో బలంగా నిలబడగలిగామన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఆర్‌డిఒ రంగస్వామి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చెన్నూరు : రామనపల్లె గ్రామంలోని ఎంపిపిఎస్‌ రామనపల్లె పాఠశాలలో అంబేద్కర్‌ సేవా సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహిం చారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు తంగేళ్ళ గురయ్యా, రామనపల్లె, సంఘ సభ్యులు సుమన్‌, బాలకష్ణ, సుబ్బరా యుడు, వెంకటరమణ, రామయ్య, యూత్‌ సభ్యులు శివ రాజేష్‌, ప్రజలు పాల్గొన్నారు. బద్వేలు : డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ అని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మాదన విజరు కుమార్‌ అన్నారు. స్థానిక బద్వేల్‌ పట్టణంలోని పిఎస్‌ భవనంలో డివైఎఫ్‌ఐ,, కెవిపిఎస్‌, ఐద్వా, మహిళా సం ఘాల ఆధ్వర్యంలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ బద్వేల్‌ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్‌ షరీఫ్‌, గంగనపల్లి నాగార్జున ,కెవిపిఎస్‌ పట్టణ అధ్యక్షుడు సగిలిరాయప్ప, సిఐటియు పట్టణ కో- కన్వీనర్‌ పి కొండయ్య, ఐద్వా పట్టణ అధ్యక్షురాలు అనంతమ్మ, డివైఎఫ్‌ఐ పట్టణ మహిళా కో కన్వీనర్‌ నాగలక్ష్మి, పట్టణ డివైఎఫ్‌ఐ నాయకులు యువరాజ్‌ పాల్గొన్నారు. పోరుమామిళ్ల : పట్టణంలోని డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహానికి కాంగ్రెస్‌ పార్టీ బద్వేల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్‌డి విజయజ్యోతి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీరాములు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తార్‌, కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు అన్వర్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ యనమల సుధాకర్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. మున్సిపల్‌ కమినర్‌ ఆధ్వర్యంలో.. డా.బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత అని మున్సి పల్‌ కమీషనర్‌ వాసుబాబు అన్నారు. రాయచోటి టౌన్‌ :అంబేద్కర్‌ గొప్ప విద్యావేత్త అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. రామాంజులు అన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 133వ జయంతిని సిఐటియు మండల కార్యదర్శి డి.భాగ్యలక్ష్మి అధ్యక్షతన సిఐటియు కార్యాల యంలో ఘనంగా నిర్వహిం చారు. అంబేద్కర్‌ చిత్రప టానికి పూల మాల వేసి నివాళులు అర్పిం చారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్‌. జబీర్‌, కెవిపియాస్‌ జిల్లా అధ్యక్షుడు డిసి.వెంకటయ్య, సిఐటియు మండల కార్యదర్శి డి.భాగ్య లక్ష్మి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు యస్‌.ఫయాజ్‌, ఖాజాబీ, అరుణ, విజయ, శంకరమ్మ, పద్మజ, ఆదిలక్ష్మి, కవిత, లక్ష్మిదేవి, ఫ్యారీజన్‌, నాగరాజు, స్కీం వర్కర్లు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. మదనపల్లి : కుల నిర్మూలన, కులవివక్షతకు వ్యతిరేకంగా పోరాడడమే డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ కు ఇచ్చే నిజమైన నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకి దళితులు, మహిళలు, అణగారిన వర్గాలపై దాడులు పెరిగిపోతు న్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కుల నిర్మూలనకు, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటాలకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. మదనపల్లె ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌, మదనపల్లె కళాశాలలో అంబేడ్కర్‌ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సి.యువరాజ్‌ తెలిపారు. పులివెందుల రూరల్‌ : భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ స్వయంశక్తితో ఎదిగిన మహనీయుడని జేఎన్టీయూ పులివెందుల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.రమణా రెడ్డి అన్నారు. ఆదివారం యూనివర్సిటీ ప్రాంగణంలో అంబేద్కర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు జమ్మలమడుగు రూరల్‌ : డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 133వ జయంతి సందర్భంగా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్‌ వద్దనున్న ఆయన విగ్రహానికి టిడిపి కడప పార్లమెంటు అభ్యర్థి భూపేష్‌ సుబ్బరామి రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బిర్రు సంతోష్‌, టిడిపి నాయకులు పాల్గొన్నారు. వైసిపి నేతల ఆధ్వర్యంలో.. భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దార్శనికుడు భారతరత్న డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆదివారం పట్టణంలోని పాత బస్టాండ్‌ కూడలిలోని అంబేద్కర్‌ విగ్రహానికి స్థానిక మున్సిపల్‌ చైర్మన్‌ వేల్పుల శివమ్మ, రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధికార ప్రతినిధి ఉప్పలపాటి యోబు, డైరెక్టర్‌ మార్బుల్‌ శ్రీను పూలమాల వేసి నివాళులర్పించారు. కిరణ్‌, గోరిగ వెంకటేష్‌, ఉమా పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్పి ఆధ్వర్యంలో.. అంబే ద్కర్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఎస్‌పి రాష్ట్ర నాయకులు జంగాల మునిస్వామి మాదిగ, ఎమ్మార్పీఎస్‌ నాయకులు జి రవీంద్ర మాదిగ, ఎంఎస్‌పి సి పాపోడు మాదిగ, కె రాజశేఖర్‌ మాదిగ, హరికృష్ణ మాదిగ, హుస్సేన్‌ మాదిగ, ఓబులేష్‌ మాదిగ, చంద్రశేఖర్‌ మాదిగ, సుబ్బు మాదిగ, పెద్దలయ్య మాదిగ, చంద్రుడు మాదిగ, నాగార్జున పాల్గొన్నారు. ఎంఇఎఫ్‌ ఆధ్వర్యంలో.. అంబేద్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్వీట్స్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఇఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పిచికే బాబు, ఓబయ్య పాల్గొన్నారు. చేనేత కార్మిక సంఘం, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో.. భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సం ఘం జిల్లా అధ్యక్షులు వీరనాలశివ నారాయణ, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్‌, డివైఎఫ్‌ఐ నాయకులు నాగేంద్ర, మహేష్‌ పాల్గొన్నారు. మైదుకూరు : మాల మహానాడు యూత్‌ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహి ంచారు. ఈ సందర్భంగా జిల్లా యూత్‌ అధ్యక్షుడు తిట్ల చిట్టిబాబు మాట్లాడారు. సలహా దారుడు ఐతాబాబు, జిల్లా ఉపాధ్యక్షులు భూమిరెడ్డి చిన్న మాధవయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్‌ కుమార్‌, పిల్లి సుమంత్‌ పాల్గొన్నారు. ఖాజీపేట : భారత రాజ్యాంగం సృష్టికర్త డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ జయంతి కార్యక్రమాన్ని ప్రజా సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు, రాజకీయ నేతలు, దళిత సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక పీడబ్ల్యూ బంగ్లా సమీపంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్‌టియు జిల్లా ఆర్థిక కార్యదర్శి గోశెట్టి రామమోహన్‌, జిల్లా ఉపాధ్యక్షులు పత్తూరు ఓబన్న, అకడమిక్‌ కమిటీ మెంబర్‌ మీసాల మున్నయ్య పాల్గొన్నారు.కలకడ: బి.ఆర్‌ అంబేద్కర్‌ 133వ జయంతి సందర్భంగా మండల కేంద్రమైన కలకడ బస్టాండ్‌లో మాలమహానాడు మాల మహానాడు ఐక్యవేదిక ఆధ్వర్యంలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించు కున్నారు. కార్యక్రమంలో మాల మహానాడు ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దామోదర, మండల అధ్య క్షులు రెడ్డికిరణ్‌, మాల మహానాడు అధ్యక్షులు రజనీకాంత్‌, కార్యదర్శులు ఆంజనేయులు, ఓబు లేసు, నటరాజ, మండల ఉపాధ్యక్షులు రెడ్డప్ప, కోశాధికారి చంద్రశేఖర, ఎంవిఎస్‌ జిల్లా నాయ కులు శ్రీనివాసులు, దళితులు పాల్గొన్నారు. బి.కొత్తకోట: పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిం చుకున్నారు. పట్టణంలోని జ్యోతి చౌక్‌ వద్ద ఆయన విగ్రహానికి గజమాల వేసి కేక్‌ కట్‌ చేసి, బాణ సంచాలు పేల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో బాస్‌ మండల అధ్యక్షుడు పలక వెంకటేష్‌, బాస్‌ నాయకులు సింగన్న, సచిన్‌, కోగర్‌మాధవ, కోగర్‌ వెంకటేష్‌, సొట్ట గంగాద్రి, లక్ష్మణ, ఆకాష్‌, పాల్గొన్నారు. రైల్వేకోడూరు: భారత రాజ్యాంగ సష్టికర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా టిడిపి ఇన్‌ఛార్జి ముక్కా రూపానందరెడ్డి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కట్టా గుండయ్యనాయుడు, జనసేన నాయకులు రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, మైసూరువారిపల్లె సర్పంచ్‌ కారుమంచి సంయుక్త వెంకటేష్‌, దళిత నాయకులు పాల్గొన్నారు. నిమ్మనపల్లి : మండల కేంద్రమైన నిమ్మనపల్లి బస్టాండ్‌లో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలను దళిత సం ఘాల నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతి నిధులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిపి జయప్రకాశ్‌ రెడ్డి, వైస్‌ ఎంపిపి జయప్రకాశ్‌రెడ్డి, టిడిపి నాయకులు ఆర్‌.జె.వెంకటేష్‌, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్‌ చిన్నబాబు, రాజన్న, చిన్నబాబు, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు వీరనాల మాణిక్యం, ఎంఆర్‌పిఎస్‌ నాయకులు రెడ్డినారాయణ, సుధా కర, కొమ్ము వెంకటేష్‌, బాస్‌ అధ్యక్షులు చెండ్రాయుడు పాల్గొ న్నారు. పీలేరు: పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో హ్యూమన్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్‌, మాల మహానాడు నాయకులు సంయుక్తంగా ఈ కార్య కమాన్ని నిర్వహించాయి. ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సుండుపల్లి: సుండుపల్లెలో ఉన్న ప్రజాసంఘాల సమైక్య సంఘం బండి సుబ్బరామయ్య ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో దళిత నాయకులు దళిత సంఘాలు కె.వి రమణయ్య, డివి.రమణయ్య, ప్రదీప్‌ నాగరాజా పాల్గొన్నారు. కలికిరి: మాలమహానాడు రాయలసీమ జిల్లాల గౌరవ అధ్యక్షుడు విహరి ఆధ్వర్యంలో అంబేద్కర్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి హాజర య్యారు. రాజంపేట అర్బన్‌ : అంబేద్కర్‌ జయంతి సంద ర్భంగా సిపిఎం, సిపిఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐటియుసి ఆధ్వర్యంలో జాతీయ రహదారిలోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ, ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు ఎంఎస్‌ రాయుడు, రవి పాల్గొన్నారు. వీరబల్లి :మండలంలో గుర్ర ప్పగారిపల్లి సర్కిల్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి ఎస్‌ఐ చంద్రమోహన్‌ పూలమాలవేసి నివాళులర్పించారు. అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల న్నారు. లక్కిరెడ్డిపల్లి: అంబేద్కర్‌ జయంతిని బిసి వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్‌ జయంతిని ఘనంగా నిర్వ హించారు. ముఖ్యఅతిథిగా డాక్టర్‌. యలంకూరి భరత్‌ కుమార్‌ పాల్గొని అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్‌ రాజ్యంగం ప్రపంచానికి ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో రవి ఆచారి, సాదుల్లా ఖాన్‌, బసయ్య, రమణ పాల్గొన్నారు.

➡️