ముగిసిన చంద్రబాబు పర్యటన

Apr 8,2024 00:33

వెళ్తూవెళ్తూ శ్రేణులకు అభివాదం చేస్తున్న చంద్రబాబు
ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ :
ఎన్నికల ప్రచారంలో భాగంగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజాగళం పేరుతో పల్నాడు జిల్లాకు వచ్చిన విషయం తెలిసిందే. శనివారం సత్తెనపల్లిలోని ఓ కళ్యాణ మండపంలో బస చేసిన చంద్రబాబు టిడిపి ముఖ్యనాయకులు, అసమ్మతి నేతలతో ఆదివారం సమావేశమయ్యారు. నియోజకవర్గాల వారీగా చర్చించి దిశానిర్దేశం చేసిన అనంతరం సాయంత్రం 4 గంటలకు సత్తెనపల్లి ఆర్సీఎం స్కూల్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుని హెలికాప్టర్‌ ద్వారా వెళ్లిపోయారు. ఆయనకు టిడిపి జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు, సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నాయకులు ఎం.శివనాగమల్లేశ్వరావు వీడ్కోలు పలికారు.

➡️