ఆదర్శ ప్రాయుడు అంబేద్కర్‌..

ఆదర్శ ప్రాయుడు అంబేద్కర్‌..

ఆదర్శ ప్రాయుడు అంబేద్కర్‌..!ప్రజాశక్తి – రామకుప్పంమండల కేంద్రమైన రామకుప్పం పోలీస్‌స్టేషన్‌ సర్కిల్‌లో మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్‌, జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ కులాలు అభ్యున్నతికి ఎనలేని కషిచేశారని కొనియాడారు. ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈనాటి యువత ఆయన ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో ప్రతి ఒక్కరు పేద, ధనిక అనే వర్గాలు లేకుండా రాజ్యానికి వన్నెతెచ్చారన్నారు. కప్పం మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌, ఎంపీపీ సుబ్రహ్మణ్యం, జెడ్పిటిసి నితిన్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ బాబురెడ్డి, కోకన్వీనర్‌ చంద్రారెడ్డి, సర్పంచులు మురళి, రాజగోపాల్‌ నేతలు కేశవరెడ్డి, చెంగారెడ్డి, భాస్కర్‌ నాయక్‌, మురుగేష్‌, నారాయణస్వామి, వెంకటేష్‌, సతీష్‌, సుగుణప్ప పాల్గొన్నారు.

➡️