ఆర్థికాభివృద్ధికే ‘ఆసరా’

Jan 30,2024 22:18
ఆర్థికాభివృద్ధికే 'ఆసరా'

– మాజీ ఎమ్మెల్యే సునీల్‌ కుమార్‌ ప్రజాశక్తి-బంగారుపాళ్యం: మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకం ద్వారా నిధులు అందజేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ అన్నారు. మంగళవారం మండల కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు 4వ విడత ఆసరా పంపిణీ కార్యక్రమం ఎంపీడీవో హరిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో 1502సంఘాలకు 14564 సభ్యులకు రూ.17కో ట్ల15లక్షలను విడుదల చేసినట్లు చెప్పారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పి.రామచంద్రారెడ్డి, ఎంపీపీ అమరావతి, వైస్‌ ఎంపీపీలు శిరీష్‌ రెడ్డి, జయకుమార్‌, జడ్పిటిసి సోమశేఖర్‌, సింగల్‌ విండో అధ్యక్షులు దత్తురెడ్డి కురబ, నాయకులు అమర్నాథ్‌, ఈశ్వర, ఎల్లప్ప సర్పంచులు శ్రీనివాసులు, ఉమాదేవి, శ్రీహరి, వాణిప్రియ తదితరులు పాల్గొన్నారు.

➡️