ఉద్యోగంతో పాటు సంక్షేమం ముఖ్యం : ఎస్పీ

Feb 14,2024 21:30
ఉద్యోగంతో పాటు సంక్షేమం ముఖ్యం : ఎస్పీ

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: పోలీస్‌ ఉద్యోగంతో పాటు వారి సంక్షేమం కూడా ముఖ్యమేనని ఏఆర్‌ బలగం జిల్లా బలగానికి వెన్నెముక లాంటిదని జిల్లా ఎస్పీ జాషువ అన్నారు. జిల్లా నూతన ఎస్పీగా భాద్యతలు స్వీకరించిన అనంతరం ఒక్కోశాఖ వారితో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ బుధవారం జిల్లాలోని సాయుధ పోలీసు అధికారులతో పట్టణంలోని పోలీస్‌ గెస్ట్‌హౌస్‌లో గల కాన్ఫరెన్స్‌ హాల్‌లో పరిచయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మొదటగా సిబ్బంది బాగోగులు, ఉద్యోగ నిర్వహణలో వారు ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ఏఆర్‌, హౌం గార్డ్‌ సిబ్బందితో దర్బారు పెరేడ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అధికారులు ప్రస్తావించిన సమస్యలు, సంక్షేమం పరంగా సూచించిన అంశాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ రానున్న రోజులలో జరగబోయే ఎన్నికలు సజావుగా జరగడానికి సాయుధ బలగాల కృషి ఎంతో అవసరమని బ్యాలట్‌ బాక్స్‌లు వచ్చిన రోజు నుండి కౌంటింగ్‌ అయ్యేవరకు ముఖ్యపాత్ర పోషించేది మీరేనని, బ్యాలట్‌ బాక్స్‌లకు ఎస్కార్ట్‌, స్ట్రాంగ్‌ రూమ్‌ల గార్డ్‌ డ్యూటీలు ఇలా ముఖ్యతరమైన ఉద్యోగాలు నిర్వహించాలని ఎస్పీ తెలియజేశారు. అలాగే ముఖ్యంగా ఏఆర్‌ పోలీసు సిబ్బంది క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాలని ఎలాంటి చెడు నడవడికకు ఆస్కారం ఇవ్వకుండా బానిస కాకుండా ఉద్యోగ నిర్వహణ చక్కగా నిర్వహించాలని హితవు పలికారు. అడిషనల్‌ ఎస్‌పి అడ్మిన్‌ అరిఫుల్ల, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్‌పి జి.నాగేశ్వర రావు, ఏఆర్‌ డిఎస్పి ఇలియాస్‌ బాష, ఎస్‌బి ఇన్స్పెక్టర్‌ గంగిరెడ్డి, ఆర్‌ఐలు నీలకంటేశ్వర రెడ్డి, మధు, భాస్కర్‌ పాల్గొన్నారు.

➡️