కర్ణాటక మద్యం పట్టివేతఇద్దరు వ్యక్తుల అరెస్

కర్ణాటక మద్యం పట్టివేతఇద్దరు వ్యక్తుల అరెస్

కర్ణాటక మద్యం పట్టివేతఇద్దరు వ్యక్తుల అరెస్టుప్రజాశక్తి -వి కోట : మండల పరిధిలో కర్ణాటక మద్యంను అక్రమంగా తరలి స్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి ఒక మోటార్‌ సైకిల్‌తో సహా ఆరు కేసుల కర్ణాటక మద్యం స్వాధీనం చేసు కున్నట్లు సీఐ లింగప్ప తెలిపారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ మద్యం, డబ్బుపై ఉక్కుపాదం మోపాలని ఎస్‌పి జాషువా ఇచ్చిన ఆదేశాల మేరకు పలమనేరు, డిఎస్‌పి మహేశ్వర రెడ్డి సూచనల ప్రకారం వికోట మండలంలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం కరిప్పల్లి గ్రామ సమీపంలోని హంద్రీ- నీవా కాలువ వద్దకు ఇద్దరు వ్యక్తులు మోటార్‌ సైకిల్‌లో కర్నాటక నుండి అక్రమ మద్యంను తీసుకొని వెళుతున్నారని అందిన ముందస్తు సమాచారం మేరకు ఎస్‌ఐ లింగప్ప, సిబ్బందితో కలిసి వి కోట పట్టణ సరిహద్దు కర్ణాటక బార్డర్‌ నుండి కరిప్పల్లి మీదుగా అడ్డ దార్లలో ఏడుచుట్లకోట గ్రామానికి వెళుతున్న వి కోట మండలం ముదరందొడ్డి పంచాయతీ ఏడుచుట్లకోట గ్రామానికి చెందిన రవి కుమారుడు రాజు, దేవరాజు కుమారుడు జగదేవను అదుపులోకి తీసుకుని వారివద్ద ఉన్న రెండు పాలిథిన్‌ సంచులలో ఉంచిన కర్ణాటకకు చెందిన 90 యంయల్‌ 6 కేసులు మొత్తం 576 టెట్రా ప్యాకెట్లతో సహా ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. వారిద్దరిపై ఎక్సైజ్‌ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వారు తెలిపారు.

➡️