కలెక్టరేట్‌ ఎదుట గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా

Dec 28,2023 22:15

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి, రెగ్యులర్‌ చేయాలి, పెండింగ్‌ జీతాలు ఇవ్వాలి, గ్రీన్‌ అంబాడిసర్లకు రూ.10,000లు ఇవ్వాలని సిఐటియు అనుభంద గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేసి డిఆర్‌ఓ రాజశేఖర్‌కి వినతిపత్రం అందజేశారు. అలాగే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన సంక్షేమ నిధులను బోర్డుకు జమచేయాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేసి డిఆర్‌ఓకి వినతిపత్రం ఇచ్చారు. బిల్డింగ్‌ వర్కర్స్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మిన్నల్‌ జ్యోతి, బంగారు మురళి, సురేష్‌, హేమంత్‌, గ్రామ పంచాయతీ కార్మికుల జిల్లా ప్రధానకార్యదర్శి గోవిందప్ప, అధ్యక్షులు మధు, కోశాధికారి రామకష్ణల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. ధర్నాలను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చైతన్య మాట్లాడుతూ జగన్మోహనరెడ్డి కార్మికవ్యతిరేకం విధానాలు విడనాడి పంచాయతీ కార్మికులు, భవననిర్మాణ కార్మికులు కోర్కెలును అంగీకరించాలని, లేకుంటే రానున్న ఎన్నికల్లో తగిన బుధి చెపుతా హెచ్చరించారు. ధర్నాలో నాయకులు మిన్నల్‌ జ్యోతి, గోవిందప్ప,తదితరులు పాల్గొన్నారు.

➡️