కాణిపాకంలో పలు శంకుస్థానలు చేసిన మంత్రి

Mar 4,2024 22:19
కాణిపాకంలో పలు శంకుస్థానలు చేసిన మంత్రి

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సోమవారం రాష్ట్ర ఉనముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర విద్యుత్‌, అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు రూ.59 కోట్లతో పలు పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈకార్యక్రమంలో మంత్రులతో పాటు చిత్తూరు ఎంపి ఎన్‌.రెడ్డెప్ప, జెడ్‌పి ఛైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు, కలెక్టర్‌ ఎస్‌.షణ్మోహన్‌ పాల్గొన్నారు. ఆలయం వద్ద రూ.4.86కోట్లతో స్వామివారి లడ్డు పోటు రెండు, మూడు అంతస్తులు భవనాలను, రూ.12.12కోట్లతో వినాయకసదన్‌ రెండు, మూడు అంతస్తుల భవనాన్ని, రూ.5కోట్లతో 750 మీటర్ల పొడవు నిర్మించిన నూరు అడుగుల రోడ్డను, రూ.30లక్షలతో గోశాల కాంపౌండ్‌ వాల్‌ను, రూ.32లక్షలతో చెత్త నుంచి సంపద తయారు చేసేందుకు బందావనం నిర్మాణంను మంత్రులు ప్రారంభించారు. రూ.1.10కోట్లతో శ్రీవీరాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణంకు, రూ.24 కోట్లతో నిర్మించనున్న శ్రీ గణేష్‌ క్యూ కాంప్లెక్స్‌ నిర్మాణానికి, రూ.3.50 కోట్లతో నిర్మించనున్న నిత్యాన్నదాన ప్రసాద భవనానికి, రూ.1.10 కోట్లతో నిర్మించునున్న నదీ స్నానపు ఘట్టాలకు, రూ.3.30 కోట్లతో దాతల సహకారంతో నిర్మించనున్న విఐపి అతిథి గృహానికి, స్వామివారి ఆలయ సమీపము వద్ద రూ.25 లక్షలతో నిర్మించనున్న నూరు అడుగుల రోడ్డు నిర్మాణానికి, ఎన్‌హెచ్‌-140 జాతీయ రహదారి వద్ద రూ.3.25 కోట్లతో నిర్మించునున్న కాంపౌండ్‌ వాల్‌, అభివద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డిఎఫ్‌ఓ చైతన్య కుమార్‌ రెడ్డి, జెడ్పి వైస్‌ఛైర్మన్‌ ధనుంజయ రెడ్డి, రాష్ట్ర పాలఏకిరీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కుమారరాజా, జెడ్‌పి సీఈఓ గ్లోరియా, కాణిపాకం పాలకమండలి ఛైర్మన్‌ మోహన్‌ రెడ్డి, ఈఓ వెంకటేశు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.రైతులకు పంట నష్టపరిహారం చెల్లింపు ఏనుగుల దాడిలో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లింపులో భాగంగా సోమవారం కాణిపాకంలో మొత్తం 1021 మంది రైతులకు రూ.1.18కోట్లు పంపిణీ చేసిన రాష్ట్ర అటవీ విద్యుత్‌, పర్యావరణ శాస్త్రసాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత అక్టోబర్‌ నుండి మొత్తం 1,304 ఎకరాల్లో పంట నష్టం బాధితులకు మెగా చెక్‌ అందించారు. గత ఏడాది అక్టోబర్‌ నుండి పంట నష్టపోయిన రైతులకు పూర్తిగా పరిహారం చెల్లించిన అటవీశాఖ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ, చిత్తూరు ఎంపి ఎన్‌.రెడ్డప్ప, జెడ్‌పి ఛైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు, కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌, డీఎఫ్‌ఓ చైతన్య కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. ఏనుగుల కట్టడికి ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసిన అటవీశాఖ మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు సిద్దం అవుతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి వివరించారు. రైతులకు పరిహారం అందిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

➡️