చంద్రబాబు సభకు ఏర్పాట్లు పూర్తి

చంద్రబాబు సభకు ఏర్పాట్లు పూర్తి

చంద్రబాబు సభకు ఏర్పాట్లు పూర్తిప్రజాశక్తి -గంగాధర నెల్లూరు: గంగాధర నెల్లూరు మండలం రామానాయుడు పల్లె వద్ద ఈనెల 6వ తేదీ ‘టిడిపి రా ..కదలిరా..’ కార్యక్రమం సభా వేదిక పనులు దాదాపు పూర్తి అయ్యాయి. బహిరంగ సభకు సమీపంలో మాజీ సీఎం చంద్రబాబు హెలికాప్టర్‌లో దిగడానికి హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యే విధంగా చిత్తూరు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని, మాజీ మంత్రి అమరనాథ్‌ రెడ్డి, గంగాధర నెల్లూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి డాక్టర్‌ థామస్‌లు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్‌, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి చిట్టిబాబు నాయుడు సభా ప్రాంగణాన్ని ఆదివారం పరిశీలించి సలహాలు, సూచనలు అందించారు.

➡️