జగనన్న ఆరోగ్య సురక్ష-2 క్యాంపు ఆకస్మిక తనిఖీ

Jan 2,2024 21:48

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌ గుడిపాలలో జగనన్న ఆరోగ్య సురక్ష-2 క్యాంపును ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన వైద్యసేవలు, ఉచిత మందుల సరఫరా, స్పెషలిస్ట్‌ డాక్టర్ల వైద్యసేవలు, కంటి వైద్యసేవలు తప్పక నిర్వహించి ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించి, అత్యవసర కేసులను కార్పొరేట్‌ ఆసుపత్రులకు రిఫర్‌ చేయాలన్నారు. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష-2 కార్యక్రమాన్ని ప్రతి అధికారి బాధ్యతతో నిర్వహించి విజయవంతం చేయాలని తెలిపారు. అడిషనల్‌ డిఏంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకట ప్రసాద్‌, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.

➡️