‘జగనన్న విదేశీ దీవెన’తో రూ.1.25కోట్లు ఆర్థికసాయం

Dec 20,2023 22:22

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ప్రతిభావంతులైన విద్యార్థుల బ్రతుకుల్లో వెలుగులు నింపే బహత్తర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించినందుకు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షణ్మోహన్‌ కతజ్ఞతలు తెలిపారు. బుధవారం జగనన్న విదేశీ విద్యాదీవెన, జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహం అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుండి లాంఛనంగా ప్రారంభించారు. ఈకార్యక్రమానికి జిల్లా సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి వర్చువల్‌ విధానంలో జెడ్పి ఛైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు, కలెక్టర్‌, నగర మేయర్‌ అముద, ఎంఎల్‌సి సిపాయి సుబ్రమణ్యం, చిత్తూరు శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు, జెడ్పి వైస్‌ ఛైర్‌పర్సన్‌ రమ్య, పాల ఏకిరీ సంఘం ఛైర్మన్‌ కుమార రాజా, స్త్రీ శిశు సంక్షేమశాఖ జోనల్‌ ఛైర్‌ పర్సన్‌ శైలజారెడ్డి, జెడ్‌పి మహిళా స్థాయి సంఘ ఛైర్‌పర్సన్‌ భారతి, సాంఘీక, బిసి సంక్షేమశాఖల జిల్లాస్థాయి అధికారులు డాక్టర్‌ రాజ్యలక్ష్మి, రబ్బానీ బాషా, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిల్లాలో జగనన్న విదేశీ విద్యా దీవెన క్రింద ఈ విడతలో రూ.1.25కోట్లు ఆర్థిక సహాయం అందుతున్నదని, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంపై వివిధ కళాశాలల ప్రిన్సిపల్‌ లు, స్కిల్‌ డెవలప్మెంట్‌ సిబ్బందితో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రోత్సహించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్‌ ముఖ్యమంత్రికి వివరిస్తూ, ప్రతిభావంతులైన విద్యార్థుల బ్రతుకుల్లో వెలుగులు నింపే ఈకార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రికి కతజ్ఞతలని తెలిపారు. ఈకార్యక్రమం అనంతరం రూ.1,24,87,162 మెగా చెక్కును ముఖ్య అతిథుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు.

➡️