నగరి పట్టణానికి ఆధునిక మెరుగులురూ. 9.5 కోట్ల నిధులతో భారీ ప్రణాళిక

నగరి పట్టణానికి ఆధునిక మెరుగులురూ. 9.5 కోట్ల నిధులతో భారీ ప్రణాళిక

నగరి పట్టణానికి ఆధునిక మెరుగులురూ. 9.5 కోట్ల నిధులతో భారీ ప్రణాళికప్రజాశక్తి- నగరి: నగరి పట్టణానికి ఆధునిక మెరుగులు సమకూరనుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక, యువజన సర్వీసుల క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు. శనివారం సాయంత్రం మున్సిపల్‌ పరిధి ఏపీ టూరిజం ప్రాంగణంలో టూరిజం శాఖ సహకారంతో రూ.9.5కోట్ల నిధులతో నిర్మించనున్న జి అరేనా కన్వెన్షన్‌ సెంటర్‌, ఫ్యామిలీ రెస్టారెంట్‌, స్విమ్మింగ్‌ పూల్‌, కమ్యూనిటీ హాలుకు భూమిపూజ చేశారు. ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు రూ. 1200 కోట్ల సంక్షేమం, రూ.500 కోట్లకు పైగా అభివద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. అలాగే నియోజకవర్గానికి శిల్పారామం మంజూరు చేయించడం జరిగిందని, ప్రస్తుతం నియోకవర్గస్థాయిని పెంచే విధంగా పలు భవనాల నిర్మాణం చేపట్టడానికి భూమి పూజ చేయడం జరిగిందన్నారు. ఏపీటీడీసీ చైర్మన్‌ డాక్టర్‌ అరిమంద వరప్రసాద్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ పీజీ నీలమేఘం, వైస్‌చైర్మన్లు బాలన్‌, వెంకటరత్నం, కౌన్సిలర్లు బీడీ భాస్కర్‌, ఇంద్రయ్య, మురుగ కోఆప్షన్‌ సభ్యులు ఆనంద్‌కుమార్‌, ఎల్లప్పరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

➡️