నిస్వార్ధంగా అభివద్ధి చేస్తున్నాం: ఎంపిసమావేశంలో మాట్లాడుతున్న ఎంపి రెడ్డప్ప

నిస్వార్ధంగా అభివద్ధి చేస్తున్నాం: ఎంపిసమావేశంలో మాట్లాడుతున్న ఎంపి రెడ్డప్పప్రజాశక్తి – రామకుప్పం: వైసిపి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజలకు నిస్వార్ధంగా అభివద్ధిని పరుగులు తీఇస్తున్నారని ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్‌ పేర్కొన్నారు. శనివారం రామకుప్పం వైసిపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. రెండు రోజుల క్రితం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలమనేరు నియోజకవర్గ పట్టణంలో పలు అభివద్ధి, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, మాజీ మంత్రి అమర్నాథ్‌ రెడ్డి పెద్దిరెడ్డిపై అవాకులు చవాకులు పేలడం సరికాదని హితవు పలికారు. గతంలో పలమనేరు నియోజకవర్గంలో అమరనాథరెడ్డి ఏం అభివద్ధి చేశారో చెప్పాలన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే వెంకట్‌ గౌడుకు 50 వేల పైచిలుకు ఓట్లు మెజార్టీ సాధిస్తారన్నారు. అమర్నాథ్‌ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించి ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. బైరెడ్డిపల్లి ఎంపీపీ రెడ్డప్ప, జడ్పిటిసి నితిన్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ బాబు రెడ్డి, కో కన్వీనర్‌ చంద్రారెడ్డి సర్పంచ్లు మురళి, రాజగోపాల్‌ నేతలు రవి నాయక్‌ ,యశ్వంత్‌ రెడ్డి, సిద్ధప్ప తదితరులు పాల్గొన్నారు.

➡️