నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి

నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి

నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి ప్రజాశక్తి – సదుం: మండల పరిధిలోని పలు గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన పలు భవనాలకు మంగళవారం ఘనంగా ప్రారంభోత్సవాలు చేశారు. ఈసందర్భంగా 15 గ్రామ పంచాయతీలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్లు-19, ఆర్‌బికెలు 3, సచివాలయాలు 3 నూతన భవనాలను రూ.3,86,4000ల వ్యయంతో నిర్మించిన పలు భవనాలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. పుంగనూరు నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి జింకా చలపతి, సదుం జడ్పిటిసి సోమశేఖర్‌ రెడ్డి, ఎంపీపీ ఎల్లప్ప, సింగిల్‌ విండో చైర్మన్‌ తిమ్మారెడ్డి, వైస్‌చైర్మన్‌ పెద్దిరెడ్డి రమేష్‌ రెడ్డి, మండల పార్టీ కన్వీనర్‌ రెడ్డెప్ప రెడ్డి, జెసిఎస్‌ ఇంచార్జ్‌ ప్రకాష్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీలు ధనుంజయ రెడ్డి, అమరావతి పుట్రాజ్‌, కోఆప్షన్‌ మెంబర్‌ ఇమ్రాన్‌, తహశీల్దార్‌ చంద్రశేఖర్‌, ఎంపీడీవో వరప్రసాద్‌, డాక్టర్‌ చరణ్‌, ఎంఈఓ శ్రీరాములు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

➡️