పంచాయతీ ఖాతా.. ఖాళీ.. మండల మీట్‌లో కుర్చీలూ.. ఖాళీ

Dec 17,2023 23:15
పంచాయతీ ఖాతా.. ఖాళీ.. మండల మీట్‌లో కుర్చీలూ.. ఖాళీ

ప్రజాశక్తి-గుడుపల్లి: పంచాయతీ ఖాతాలో నిధులు లేవని.. చేసిన పనులకు బిల్లులు రాలేదని సర్వసభ్య సమావేశంలో గుండ్లసాగరం సర్పంచ్‌ నాగరాజు అధికారులను నిలదీశారు. గ్రామాల్లో కనీస అవసరాలు కల్పించేందుకు ప్రజలకు చెపకోలేేక గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మండల స్త్రీ శక్తి భవనంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ వరలక్ష్మీ అధ్యక్షతన తూతూ మంత్రంగా జరిగింది. ఉదయం 10గంటలకు ప్రారంభం కావలసిన సమావేశం 11.50గంటల వరకూ కూడా మొదలు కాలేదు. 13మంది ఎంపీటీసీలు ఉండగా కేవలం 5 మందిని ఫోన్‌లో బ్రతిమలాడి పిలిపించుకొని 15నిమిషాల్లో సమావేశాన్ని పూర్తిచేసి మమ అనిపించుకున్నారు. మండలంలో 18మంది సర్పంచ్‌లు ఉండగా అందులో కేవలం ముగ్గురు మాత్రమే సమావేశానికి హాజరైయ్యారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు లేవని, చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయలేదంటూ సర్పంచ్‌ నాగరాజు, వెంకటేష్‌ ధ్వజమెత్తారు. అధికారులపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఎంపీడీవో తాజ్‌ మస్రూర్‌ ఈ సమావేశాన్ని అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించారు.

➡️