పెండింగ్‌ కేసులు త్వరగా పరిష్కరించాలి: హైకోర్టు జడ్జి

Jan 27,2024 22:19
పెండింగ్‌ కేసులు త్వరగా పరిష్కరించాలి: హైకోర్టు జడ్జి

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: జిల్లాలోని వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, చిత్తూరు జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్‌ రావు రాఘనందన రావు పేర్కొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.బీమారావుతో కలసి శనివారం ఉదయం జడ్పీ మీటింగ్‌ హల్‌లో అడ్మినిస్ట్రేషన్‌ సివిల్‌, క్రిమినల్‌ కేసుల పరిష్కారంకు సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జ్యూడిషియల్‌ ఆఫీసర్స్‌కు నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల కేసులను త్వరగా పరిష్కరించాలని సంబంధిత జ్యూడిషియల్‌ ఆఫీసర్స్‌ను ఆదేశించారు. ఎక్కువ కేసులు పరిష్కరించిన న్యాయ మూర్తులను ఈసందర్భంగా అభినందించారు. సివిల్‌, క్రిమినల్‌ కేసులు పరిష్కారం కోసం అవసరం అయ్యితే విశ్రాంతి న్యాయమూర్తులు సలహాలు సూచనలు తీసుకొని కేసులో పరిష్కరించాలన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ, 13 మండల న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్‌అదాలత్‌, జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహించి వివిధ రకాల కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. జిల్లాలో కోర్టు భవనాలు, జడ్జిల క్వాటర్స్‌ నిర్మాణాల పనులకు సంబంధించి వివరాలను హైకోర్టు జడ్జికి వివరించారు. అంతకు ముందు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, చిత్తూరు జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్‌ రావు రాఘనందన రావును జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌, జిల్లా ఎస్పీ వై.రిశాంత్‌ రెడ్డి, జడ్పీ సీఈఓ ఎం.ప్రభాకర్‌ రెడ్డి, ఆర్డీఓ చిన్నయ్య, ఆర్‌ అండ్‌ బి అతిథి గహంలో మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛాన్నాఇ అందజేసి సన్మానించారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి డాక్టర్‌ ఐ.కరుణ కుమార్‌, పొక్స్‌ కోర్టు జిల్లా జడ్జి శాంతి, 8వ అదనపు జిల్లా జడ్జి ఎస్‌.శ్రీదేవి, అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌పిడి. వెన్నేల, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి డి.ఉమాదేవి, 1వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి మాధవి, 3వ అదనపు 1వ తరగతి మేజిస్ట్రేట్‌ ఎస్‌.శ్రీనివాస్‌ మూర్తి, 4వ అదనపు జ్యూడిషియల్‌ మేజిస్ట్రేట్‌ షేక్‌.బాబజాన్‌, స్పెషల్‌ జ్యూడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కీర్తన, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అదనపు సీనియర్‌, జూనియర్‌ జడ్జీలు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.చిత్తూరు న్యాయవాదుల సంఘం సభ్యుల సమస్యలను హైకోర్టు కమిటీ దష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, చిత్తూరు జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్‌ రావు రాఘనందన రావు తెలిపారు. శనివారం మధ్యాహ్నం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.బీమరావు, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్‌ సివిల్‌ జడ్జి డాక్టర్‌ ఐ.కరుణ కుమార్‌లతో కలసి చిత్తూరు న్యాయవాదుల సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు చిత్తూరు న్యాయవాదుల సంఘంకు భవనాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలు గురించి తనకు తెలుసునని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ న్యాయవాదుల సంఘాల సభ్యులు చెప్పిన సమస్యలను రాష్ట్ర హైకోర్టు కమిటీ దష్టికి తీసికెళ్లడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి నెల చివరకల్లా జిల్లా కోర్టు భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లా కోర్టు సముదాయం నూతనంగా నిర్మిస్తున్న కోర్టు భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నాణ్యతతో కూడిన పరికరాలను ఉపయోగించి పనులు పూర్తిచేసి ఫిబ్రవరి నెల చివరకల్లా జిల్లా కోర్టు భవనాన్ని అందజేయాలని ఆర్‌ అండ్‌బి అధికారులను ఆదేశించారు. కోర్టు భవనంలో జరుగుతున్న పనులు, వాటికి ఉపయోగిస్తున్న వివిధ రకాల వస్తువులు, కోర్టు హాల్స్‌, లిఫ్ట్‌ నిర్మాణ పనులు, కేసుల పరిష్కరం కోసం కోర్టు వచ్చే వారికి తాగునీరు సౌకర్యాలకు సంబంధించి జరుగుతున్న పనులను సకాలంలో పూర్తి చేసి అందజేయడం జరుగుతుందని ఆర్‌ అండ్‌ బి అధికారులకు జడ్జికి వివరించారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న రికార్డుల గదులను పరిశీలించిన సందర్భంగా పాత రికార్డుల వివరాలను గురించి జిల్లా న్యాయమూర్తి హైకోర్టు జడ్జికి వివరించారు.

➡️