ప్రకృతి వ్యవసాయ దిగుబడులతోనే సంపూర్ణ ఆరోగ్యం

Feb 1,2024 21:09
ప్రకృతి వ్యవసాయ దిగుబడులతోనే సంపూర్ణ ఆరోగ్యం

ప్రజాశక్తి-కార్వేటినగరం: ప్రకతి వ్యవసాయ పంటలను ఆహారంగా తీసుకోవడం ద్వారా మానవుని ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ఎంపీపీ లతబాలాజీ అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో ప్రకతి వ్యవసాయంతో పండించిన పంటలను విక్రయించికోవడానికి మార్కెట్‌ను ప్రారంభించారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి రైతు ప్రకతి వ్యవసాయాన్ని అలవర్చుకుని పంటల సాగుకు ముందుకు రావాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారపు సంతలు ఏర్పాటు చేసి రైతు పండించే పంటలకు దళారీ వ్యవస్థ లేకుండా రైతులే మార్కెట్లో అమ్మకాలు చేసుకుని స్వయంగా లాభాలు గడించే విధంగా చర్యలు చేపడుతుందన్నారు. అనంతరం ప్రకతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ వాసు మాట్లాడుతూ ప్రకతి వ్యవసాయం చేయడం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉందన్నారు. గతంలో రైతులు ప్రకతి వ్యవసాయమే చేసే వారని అప్పట్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండే వారని గుర్తు చేశారు. నేడు విరివిగా రసాయనిక ఎరువులతో కూడిన వ్యవసాయం చేయడం ద్వారా అన్ని రకాలైన వ్యాధులు వయస్సుకు పరిమితం లేకుండా వ్యాపిస్తూ ఆర్థికంగా ప్రజలు నష్టపోతున్నారని తెలిపారు. ఒక్క దేశవాళి ఆవు ఉంటే వాటి గోమూత్రం, పేడతో 20 నుంచి 30 ఎకరాల వరకు సాగుచేసుకోవచ్చని తెలిపారు. జీవామతం, సీమామతం, ఘన,ద్రవ వంటి కషాయాలను తయారు చేసుకుని భూసారాన్ని పెంచుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకతి వ్యవసాయాన్ని విస్తరింపజేసి మానవాళి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. అనంతరం ఎంఎం విలాసం, ఆర్కేవీబీపేట రైతులు ప్రకతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన వారపు సంతలో అమ్మకాలు జరిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ధనంజయవర్మ, వైస్‌ సర్పంచ్‌ శేషాద్రి, ఎంపీడీవో మోహన్‌మురళీ, ఏఈవో గాయత్రి, లోకనాధనాయుడు, డీఆర్డీఎ సిబ్బంది, సీసీలు, మాస్టర్‌ ట్రెనెర్‌ హనుమంతు, యూనిట్‌ ఇన్చార్జిలు మురళి, సురేష్‌, రైతులు పలువురు పాల్గొన్నారు.

➡️