మూడు తలలున్న వింత దూడకు జన్మనిచ్చిన ఆవు

Mar 26,2024 21:32
మూడు తలలున్న వింత దూడకు జన్మనిచ్చిన ఆవు

ప్రజాశక్తి-గంగాధరనెల్లూరు: జీడీ నెల్లూరు మండలం బుక్కాపట్నంలోని జిలేబి అనే రైతు ఇంట ఉన్న పశువు మంగళవారం వింత దూడకు జన్మనిచ్చింది. జిలేబీ ఆనే రైతు ఇంట రెండు పశువులు ఉండగా.. అందులోని ఓ పశువు మూడు తలలు, మూడు నోళ్లు, మూడు నాలుకలతో కలిగిన పళ్ళు ఉన్న ఒక వింత దూడకు జన్మనిచ్చింది. దీన్ని గుర్తించిన ఆ రైతు ఇంట్లోని కుటుంబ సభ్యులు మొదట భయభ్రాంతులకు గురయ్యారు. ఈ వింతను చూడటానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

➡️