యువతకు జీవనోపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం- డిప్యూటీ సీఎం నారాయణస్వామి

యువతకు జీవనోపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం- డిప్యూటీ సీఎం నారాయణస్వామి

యువతకు జీవనోపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం- డిప్యూటీ సీఎం నారాయణస్వామిప్రజాశక్తి – కార్వేటినగరం: యువతీ, యువకులకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కొల్లాగుంట చెక్‌పోస్టు వద్ద వైసిపి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ యువతకు జీవనోపాధి కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నిరుద్యోగులు రాయితీపై రుణసౌకర్యాలు కల్పించి వారికి ఆర్థిక తోడ్పాటును అందిస్తారన్నారు. ఇలాంటి అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. అనంతరం రిబ్బన్‌ కట్‌చేసి దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపిశెట్టిపల్లి సర్పంచ్‌ మురగయ్య మంత్రికి శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లత బాలాజీ, మండల కన్వీనర్‌ శేఖర్‌రాజు, ఆంబేద్కర్‌ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాజ్‌, నరేష్‌, ఉప సర్పంచ్‌ మోహన,్‌ మాజీ సర్పంచ్‌ మునికష్ణ, మణి, దేశయ్య, శోభన్‌బాబు, వెంకటేష్‌, పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.

➡️