రక్తదానం ప్రాణదానంతో సమానం

Jan 12,2024 22:47
రక్తదానం ప్రాణదానంతో సమానం

డీఎంహెచ్‌వో ప్రభావతి దేవిప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: రక్తదానం ప్రాణదానంతో సమానమని జిల్లా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ప్రబావతి దేవి అన్నారు. శుక్రవారం జిల్లా హాస్పిటల్‌ చిత్తూరు, పలమనేరు, నగరి, కుప్పంలో ”నేషనల్‌ యూత్‌ డే” సందర్భంగా సామాజిక సమతా సంకల్పంతో బ్లడ్‌ బ్యాంక్‌లో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి స్వచ్ఛందంగా రక్తదానం చేయుటతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగికి ఈ రక్తం, ప్రాణదానంతో సమానమని తెలిపారు. మనుషుల జీవితాన్ని కాపాడిన వారు అవుతామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అందరికీ అవగాహన కల్పించి స్వచ్ఛందంగా రక్తదానం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అరుణ్‌ కుమార్‌, డాక్టర్‌ శిరీష, గుణశేఖర్‌ పాల్గొన్నారు.

➡️