రూ.3కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

రూ.3కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

రూ.3కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభంప్రజాశక్తి- తవణంపల్లి: మండలంలోని గురుకువారిపల్లి పంచాయతీ పరిధిలో ఓవర్‌ హెడ్‌వాటర్‌ ట్యాంకులు, సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు, పంచాయతీ భవనం, బస్సు షెల్టర్లు, వైయస్సార్‌ గ్రామీణ ఆరోగ్య కేంద్రం తదితర అభివద్ధి పనులను ఎంపి రెడ్డప్ప, జెడ్‌పి ఛైర్మన్‌ గోపిందప్ప శ్రీనివాసులు మంగళవారం ప్రారంభించారు. వారి వెంట సీనియర్‌ వైసీపీ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త గురుకువారిపల్లి ప్రకాశ్‌ రెడ్డి సోదరులు, పూతలపట్టు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా జెడ్‌పి ఛైర్మన్‌, ఎంపి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో సుమారు రూ.3కోట్లు వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే అది కేవలం వైసిపి ప్రభుత్వం వల్లే సాధ్యమన్నారు. ప్రతిపక్షాలు ఏదో బురద చల్లడానికి విమర్మిస్తూనే ఉన్నాయని అటువంటి వారికి గురుకువారిపల్లి పంచాయతీనే మంచి నిదర్శనమని అన్నారు. గురుకువారిపల్లి పంచాయతీలో పట్లపల్లి గ్రామంలో గురుకువారి చంగల్‌రెడ్డి జ్ఞాపకార్థం ప్రకాష్‌రెడ్డి సోదరులు సొంత నిధులతో బస్‌ షెల్టర్‌, పొదుపు సంఘాల సమావేశ భవనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్‌ సిపి.హరిరెడ్డి, ఎంపీపీ గీత హరికష్ణ రెడ్డి, జడ్పిటిసి భారతి మధు కుమార్‌, వైస్‌ ఎంపీపీలు పట్నం ప్రతాప్‌ రెడ్డి, శోభబాబు రెడ్డి, సచివాలయ కన్వీనర్‌ శరత్‌ చంద్రరెడ్డి పాల్గొన్నారు.

➡️