రెండో రోజూ మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Jan 4,2024 22:11
రెండో రోజూ మున్సిపల్‌ కార్మికుల సమ్మె

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె గురువారానికి రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ప్రభుత్వ తీరును నిరసిస్తూ నేలపై పడుకున నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ పారిశుద్ధ్యం కార్మికులు ఇంజనీర్‌ విభాగం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వేతనం పెంచాలని, ఔట్సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు శరవణ, జయప్రకాష్‌, వెంకటేష్‌, లక్ష్మి, వాసు, జయశంకర్‌, సురేష్‌, వినాయక, సుగుణ, ఈశ్వర్‌, రమణి, చిత్ర, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

➡️