రేషన్‌ బియ్యం పట్టివేత

రేషన్‌ బియ్యం పట్టివేత

రేషన్‌ బియ్యం పట్టివేతప్రజాశక్తి -సోమల: మండలంలోని మేనేజర్‌ పంచాయతీ కేంద్రమైన కందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఆదివారం అక్రమంగా బొలోరో వాహనంలో తరలిస్తున్న 1640 కేజీల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని 9 మంది పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకట నరసింహులు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు కందూరు మార్గంలో ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టగా బొలెరో వాహనంలో 30 బస్తాల పిడిఎఫ్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ తనిఖీల్లో పట్టుబడ్డారని అక్రమ బియ్యం తరలింపులో తొమ్మిది మంది పాత్ర ఉన్నట్లు గుర్తించి వారిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మొహమ్మద్‌ నయాజ్‌, మున్వర్‌ భాష వీరి ఇద్దరు పలమనేరు కు చెందిన వారు కాగా మిగిలిన వారు కూడా రేషన్‌ బియ్యం అక్రమ రవాణాలో పాత్ర ఉందని గుర్తించి కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్‌ కానిస్టేబుల్‌ బాలచంద్రయ్య, పోలీసులు బుడ్డా నాయక్‌, ఫైజుద్దీన్‌,ఫాయజ్‌ పాల్గొన్నట్లు తెలిపారు.

➡️