వైసీపీకి తగిన గుణపాఠం చెబుతాం: చల్లా

Mar 26,2024 21:33
వైసీపీకి తగిన గుణపాఠం చెబుతాం: చల్లా

ప్రజాశక్తి-పుంగనూరు: టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీకి తగిన గుణపాఠం చెబుతామని టీడీపీ పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలు రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోయిందని, వెనుగబడిన అభివృద్ధిని అధికారంలోకి రాగానే పరుగులు పెట్టిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. పట్టణంలోని పలు వీధుల్లో ఇంటింటికీ వెళ్లి టీడీపీకి ఓటేసి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో సయ్యద్‌ సుహేల్‌ బాషా, సివిరెడ్డి, మజా కౌన్సిలర్‌ ప్రకాష్‌, శ్రీనివాస్‌ , రామయ్య, నాగరాజు, సుబ్రమణ్యం రాజు తదితరులు పాల్గొన్నారు.టీడీపీలో చేరిన వ్యాపారవేత్త.. పుంగనూరు పట్టణానికి చెందిన దోమలపాటి నగేష్‌బాబు(ఆర్‌వీటీ బాబు) మంగళవారం టీడీపీలో చేరారు. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

➡️