సీఐపై చర్యలు తీసుకోవాలి

Apr 12,2024 17:36 #Chittoor District
  • మహిళలపై అనుచిత వ్యాఖ్యలపై కలెక్టర్ కి ఫిర్యాదు

ప్రజాశక్తి-బంగారుపాలెం : బంగారుపాలెం మండలం 172 మొగిలి వెంకటగిరి కి చెందిన సుబ్రహ్మణ్యం, కృష్ణయ్య, లోకేశ్వర రైతులు సాగు చేసుకుంటున్న భూమిలో ఉన్న 150 మామిడి చెట్లు, 40 కొబ్బరి చెట్లను అక్రమంగా దౌర్జన్యంగా నరికి వేసిన భూకబ్జాదారులైన మహేంద్ర ను వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన భాదితులు మొదట ఫిర్యాదు తీసుకోకపోవడంతో అక్కడే ఉండి ఒత్తిడి అక్కడే వుండి న్యాయం చేయాలని పదే పదే కోరుగా ఫిర్యాదు తీసుకొని కబ్జాదారులపై కేసు కట్టారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా పంచనామా పేరుతో బాధితుడు సుబ్రమణ్యం ని పొలం దగ్గర కు రమ్మని చెప్పిన సీఐ కబ్జాదారులను వెంట వేసుకొని వచ్చి సిఐ ముందరే వీరు గొడవ చేస్తున్న ఏమాత్రం పట్టించుకోకుండా సిఐ కూడా మాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం అని వాపోయారు . మహిళలను చూడకుండా ఫోన్లు లాక్కొని పగులగొట్టి అని కొట్టడానికి వెళ్ళే విధంగా ప్రవర్తించడంతో మహిళలగా మానసికంగా ఇబ్బంది పడుతున్నాం.మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సిఐ పై చర్యలు తీసుకోవాలని శుక్రవారం బాధితులు జిల్లా కలెక్టర్,ఎస్ పి, పలమనేరు ఆర్డిఓ ,డిఎస్పిను లను కలిసి తమ గోడును చెప్పడం జరిగింది. వాటిని విన్న అధికారులు పరిశీలన చేసి న్యాయం చేస్తామని తెలిపారు.వీరికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు మద్దతుగా నిలబడ్డారు. ఇప్పటికైనా జిల్లా వనతాధికారులు స్పందించి మాకు న్యాయం చేసి రచన కల్పించాలని కోరారు

➡️