విద్యార్థులకు దాతల సహకారం అభినందనీయం

Jan 27,2024 12:01 #Chittoor District
donation to students

ప్రజాశక్తి-వెదురుకుప్పం( చిత్తూరు జిల్లా) మండలంలోని దేవళంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ విద్యార్థులకు శనివారం విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. మర్రిపల్లి గ్రామానికి చెందిన అనిల్  కుమార్, రమ్యకృష్ణ దంపతుల కుమారుడు నిశ్చల్ ఆనంద్ జన్మదిన సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రితో పాటు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. స్థానిక ప్రధానోపాధ్యాయిని లీలావతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. అలాంటి వారి సేవ కార్యక్రమాలను విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయిని ఆదర్శ దంపతులను శాలువాతో సత్కరించి వారి సేవాభావానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంది మరియు విద్యా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

➡️