మామిడి పంటలపై ఏనుగులు దాడులు

May 27,2024 16:43 #Chittoor District

ప్రజాశక్తి-సదుం : మండల పరిధిలోని తాటి గుంట పాల్యేం గ్రామ పంచాయతీ పరిధిలోని చింతల వారిపల్లి కి చెందిన మామిడి రైతుల తోటల పై ఆదివారం రాత్రి ఏనుగులు గుంపు దాడులు చేసిన సంఘటనలు సోమవారం సదుం లో వెలుగులోకి వచ్చాయి.వివరాలు ఇలా వున్నాయి.. చింతల వారిపల్లి కి చెందిన చింతల నారాయణ రెడ్డి, కే. దేవేంద్ర రెడ్డి, ఎ. రమణ, శ్రీరాములు అనే మామిడి రైతుల తోటలు సుమారుగా 15 ఎకరాల మామిడి తోటల పై ఏనుగులు గుంపు పడి, మామిడి చెట్ల కొమ్మలను విరిచేయడం, కాయాలను ఇష్టానుసారం పెరికేయడంతో మామిడి రైతులకు తీవ్ర నష్టం జరిగినట్లు రైతులు ఆదివారం ప్రజాశక్తికి తెలిపారు. ఈ సంవత్సరం మామిడి పంట అంతంత మాత్రంగా వున్న సమయంలో మామిడి పంటలపై ఏనుగులు దాడి చేసి తీవ్రంగా నష్టం చేయడం పట్ల మామిడి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

➡️