‘వైఎస్సార్ కాంతి’ ఉద్యోగుల సమ్మె

sarp employees strike in chittoor
  •  ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి
  • సర్ఫ్ ఉద్యోగులు

ప్రజాశక్తి-చిత్తూరు : ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ(DRDA) లో పని చేస్తున్న ఏపీఎంలు, సీసీలు, డీఎంపీలు, ఏరియా కోఆర్డినేటర్లు సమ్మెలో భాగంగా సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంతి పథకం ఉద్యోగుల సంఘం నాయకులు( సర్ఫ్) హరినాథ్, ప్రభాకర్, సుధాకర్, రజనీలు మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్ఫ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని, టైమ్స్ స్కేల్ అమలు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడే ఐదేళ్లు గడుస్తున్న తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆందోళనకు పూనుకోవాల్సి వచ్చిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సాయం సాయక సంఘాల మహిళలకు సహాయ సహకారాలు అందిస్తూ విధులు నిర్వహిస్తున్న తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వైయస్సార్ క్రాంతి పథకం ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

➡️