నోడల్‌ అధికారులకు కేటాయించిన బాధ్యతగా విధులు నిర్వహించాలి: కలెక్టర్‌

నోడల్‌ అధికారులకు కేటాయించిన బాధ్యతగా విధులు నిర్వహించాలి: కలెక్టర్‌

నోడల్‌ అధికారులకు కేటాయించిన బాధ్యతగా విధులు నిర్వహించాలి: కలెక్టర్‌ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: నోడల్‌ ఆఫీసర్లకు కేటాయించిన విధులను బాధ్యతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సగిలి షన్మోహన్‌ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌ సమావేశం హల్‌లో జిల్లా ఎస్పీ విఎన్‌.మణికంఠ చందోలు, జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు, డిఆర్‌ఓ బి.పుల్లయ్యతో కలిసి 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం నియమించిన వివిధ రకాల టీమ్స్‌ నోడల్‌ అధికారులు నిర్వహిస్తున్న విధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ నోడల్‌ ఆఫీసర్లకు కేటాయించిన విధులను బాధ్యతతో నిర్వహించాలన్నారు. గత నెల 16 ఎన్నికల షెడ్యూల్‌ వచ్చినప్పటి నుండి ఎన్నికల పూర్తి అయ్యేవరకు వివిధ రకాల టిమ్స్‌ నోడల్‌ అధికారు బాధ్యతగా విదులు నిర్వహించాలని సంబందితా నోడల్‌ అధికారులను ఆదేశించారు. ఈనెల 18న ఎన్నికల నోటిఫికేషన్‌ విధుల చేయడం జరుగుతుందని అప్పటి నుండి మరింత బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు. టీమ్స్‌ రోజువారీ నివేదికల రిజిస్టర్లు నిర్వహణకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి సమీక్షించారు. సంబంధించిన టీమ్‌ అధికారులు వారు ఇప్పటివరకు నిర్వహించి విధులకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారికి వివరించారు. మీ టిమ్స్‌ సభ్యులు సహకారంతో ఎలాంటి పొరపాట్లు జరగకుండా విధులు నిర్వహించాలని, ఏరోజుకు సంబంధించిన నివేదికల రిపోర్ట్స్‌ను అదే రోజు సంబంధిత ఆర్‌ఓ ద్వారా జిల్లా ఎన్నికల అధికారికి పంపించాలని సంబందితా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా లోని వివిధ రకాల టిమ్స్‌ నోడల్‌ ఆఫీసుర్లు పాల్గొన్నారు.

➡️