ఆ ఊరంతా కరెంట్‌ షాక్‌!ఏ వస్తువు పట్టుకున్నా షాక్‌ భయాందోళనలో గ్రామస్తులునిన్నటి రాత్రి నుంచి ఇదే పరిస్థితిఇళ్లకు వెళ్ల లేక ఆరుబయటే గ్రామస్తులుఅధికారుల దృష్టికి తీసుకెళ్లిన వైనం

ఆ ఊరంతా కరెంట్‌ షాక్‌!ఏ వస్తువు పట్టుకున్నా షాక్‌ భయాందోళనలో గ్రామస్తులునిన్నటి రాత్రి నుంచి ఇదే పరిస్థితిఇళ్లకు వెళ్ల లేక ఆరుబయటే గ్రామస్తులుఅధికారుల దృష్టికి తీసుకెళ్లిన వైనంప్రజాశక్తి – వెదురుకుప్పం : ఆ ఊరంతా విద్యుత్‌ షాక్‌కు గురవుతు న్నారు. ఏ వస్తువు తాకినా విద్యుత్‌ సరఫరా అవుతుండడంతో ప్రజలు భయాందో ళనకు గురవు తున్నారు. మంగళవారం రాత్రి నుంచి వెదురుకుప్పం మండలం నల్లవెంగనపల్లి పంచాయతీ మిట్టూరులో ఈ పరిస్థితి నెలకొనగా బుధవారం వెలుగుచూసింది. ఆ ఊరి ఇంటి గోడలు, వస్తువులు, ఫర్నీచర్లకు కరెంట్‌ సరఫరా అవుతోంది. వాటిని పట్టుకుంటే విద్యత్‌ షాక్‌కు గురవుతున్నారు. దీంతో ఏ వస్తువును పట్టు కోవాలన్నా మిట్టూరు వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితి సంబంధిత విద్యుత్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. విద్యుత్‌ షాక్‌ భయంతో ప్రజలు ఇళ్లు విడిచి ఆరు బయటే కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్‌ శాఖాధి కారులు స్పందించాలని మిట్టూరు ప్రజలు కోరుతున్నారు. అన్ని వస్తువులకు విద్యుత్‌ సరఫరా కావడానికి కారణమేమిటో తెలియక ఆ గ్రామస్తులు అయోమయంతో దిక్కులు చూ స్తున్నారు. తాము రోజూ నిర్వహించాల్సిన పనులు సైతం మానుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ సరఫరాను పూర్తిగా ఆపివేసి రాత్రి వేళలో నూనె దీపం వెలుగును ఆశ్రయించాల్సి వస్తోందని తెలిపారు.

➡️