ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి :  సిపిఎం

Jun 20,2024 16:31 #CPIM, #Kurnool

ఫోటో: సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రామాంజనేయులు

ప్రజాశక్తి – ఎమ్మిగనూరు : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రామాంజనేయులు పిలుపునిచ్చారు. గురువారం సిపిఎం పార్టీ ఎమ్మిగనూరు పట్టణ కమిటీ సురేష్ అధ్యక్షతన స్థానిక సుందరయ్య భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. రామాంజనేయులు, సిపిఎం జిల్లా నాయకులు గోవిందు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎన్డీఏ భాగస్వామి పక్షాలను డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి 370 స్థానాలను ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు 400 స్థానాలను లక్ష్యంగా మోడీ ప్రకటించారని తెలియజేశారు. అయితే బిజెపి 240 స్థానాలకు పరిమితమైందని, దాని మిత్రపక్షలతో కలుపుకొని ఎన్డీఏ అధికారాల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. అయినా సంపూర్ణ మెజార్టీ బిజెపికి దక్కలేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మోడీ పీఎం కిసాన్ పై సంతకం చేశారని, ఇది కొత్త సీసాలో పాత సారా చందంగా ఉందని ఎద్దేవా చేశారు. రైతులు 14 నెలలపాటు పోరాటం చేసి నాలుగు నెలల నల్ల చట్టాలను రద్దు చేసి విజయం సాధించారని అన్నారు. ఆ సందర్భంగా ప్రధానమంత్రి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. రైతులందరూ దేశవ్యాప్తంగా బిజెపికి తగిన బుద్ధి ఈ ఎన్నికల్లో చెప్పారని తెలియజేశారు. ఎన్నికల సందర్భంగా యువతకు ఉపాధి, ప్రజలకు నిత్యావసర వస్తువులధరల తగ్గింపు, ఇప్పుడైనా అమలు చేయాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు ప్రకటించిన సిక్స్ ప్యాక్ ను అమలు చేయాలని, వాటిలో ల్యాండ్ టైటిల్ ఆక్ట్ రద్దు. మెగా డీఎస్సీ, పెన్షన్ పెంపు, ఉపాధి స్కిల్ డెవలప్మెంట్, అన్న క్యాంటీన్ పై చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేయడం హర్షించదగ్గ విషయమని ఆయన తెలిపారు. సిపిఎం ఆధ్వర్యంలో జూన్ 24, 25, 26 తేదీలలో ఆదోని మండలం పాండవగల్లు లో జరుగు శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాముడు, లక్ష్మీనరసయ్య, సురేష్, అబ్దుల్లా, వెంకటేష్, రవికుమార్, నామాల రాముడు, ప్రవీణ్, లక్ష్మన్న పాల్గొన్నారు.

➡️