బిజెపి తొత్తులను ఓడించండి

  పిడుగురాళ్ల:  బిజెపి కూటమికి మద్దతుగా ఉన్న టిడిపి ,జనసేన పార్టీలను, దానికి తొత్తుగా ఉన్న వైసిపిని ఓడించి ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపిం చాలని కోరుతూ కాంగ్రెస్‌, సిపిఎం శ్రేణులు పిడుగురాళ్ల మండలంలో శుక్రవారం పర్య టించారు. కాంగ్రెస్‌ పార్టీ గురజాల నియోజకవర్గ అభ్యర్థి తియ్యగూర యలమంద రెడ్డిని, నర్సరావుపేట పార్లమెంట్‌ అభ్యర్థి అలెగ్జాండర్‌ సుధాకర్‌ని గెలిపించాలని కోరుతూ గుత్తికొండ, జూలకల్లు పందిటివారిపాలెం, చిన్న అగ్రహారం, పెదగ్రహారం, చెన్నయి పాలెం తదితర గ్రామాల్లో ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి తిరుపతి వెంకన్న సాక్షిగా అమరావతి రాజధానికి మంచినీళ్లు ,మట్టి ప్రజల ముఖానికి కొట్టి మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వ పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయడం సిగ్గుచేటని ,నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు, కార్మిక చట్టాలను సవరణ చేస్తూ, ఉన్న హక్కులను కూడా హరించేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రతి పేద మహిళలకు లక్ష రూపాయలు ఆదాయం వచ్చే విధంగా, ప్రతి పేద ప్రజల ఐదు లక్షలు రూపా యలతో ఇల్లు కట్టించి సొంతింటి కల నెరవేరుస్తుం దని, వ్యవసాయం గిట్టుబాటు గాక, అప్పుల పాలైన రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అమలు చేస్తుందని, సామాజిక పింఛన్లు వృద్ధాప్య పెతంతు వితంతు వులకు రూ.4000, వికలాంగు లకు రూ.6000 చేస్తుందని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తుందని అన్నారు. కమ్యూనిస్టులు బలపరిచిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రచార కార్యక్రమంలో సిపిఎం ,కాంగ్రెస్‌ కార్యకర్తలు ఢకొీండా వెంకటేశ్వర్లు, షేక్‌ బాబు, కోటిరెడ్డి, రామకృష్ణ, లింగయ్య ,రమణ, లక్ష్మి, అంకమ్మ, గోవిందు, కృష్ణ ,శ్రీను భాష, సైదాబీ పాల్గొన్నారు.

➡️