రాక్షస పాలన తరిమి కొట్టాలి: కళా

Apr 26,2024 20:38

ప్రజాశక్తి – గుర్లరాష్ట్రంలో రాక్షస పాలనను తరిమి కొట్టాలంటే సైకిల్‌ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని ఎన్‌డిఎ ఉమ్మడి అభ్యర్థి కిమిడి కళా వెంకట రావు కోరారు. శుక్రవారం మండలంలో భూపాల పురం, నడుపూరు, ఆనందపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భూపాలపురం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జరుగుతున్న ప్రాంతంలో పర్యటించి వేతనదారులతో ముచ్చటించారు. బడుగు బలహీన వర్గాలను రైతు లను ఆదుకునే పార్టీ టిడిపి అని తెలిపారు. గత టిడిపి ప్రభుత్వంలో తోటపల్లి నుంచి సాగునీరు అందిస్తే, ఈ అరాచక ప్రభుత్వం రూ.5కోట్లు నిధులు విడుదల చేయకపోవడంతో రైతులు రూ.500 కోట్ల విలువైన పంటలను నష్టపోయారని విమర్శించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు, బీసీ డిక్లరేషన్‌లపై ప్రజలకు వివరిచారు. అనంతరం భూపాలపురం, ఆనందపురం మాజీ సర్పంచులు వైసిపిని వీడి వారి అనుచరులతో టిడిపిలో చేరారు. వారిని కళా వెంకట రావు పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిసి సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి వెన్నె సన్యాసినాయుడు, టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి టి కిరణ్‌ కుమార్‌, టిడిపి మండల అధ్యక్షులు చనమల్ల మహేశ్వరరావు, నాగులపల్లి నారాయనారావు, గొర్లి రామునాయుడు, పిల్ల అప్పలనాయుడు, కిలారి సూర్యనారాయణ, పాల్గొన్నారు.టిడిపి తీర్ధం పుచ్చుకున్న విజయశారధిరావుచీపురుపల్లి: పట్టణానికి చెందిన డాక్టర్‌ ఆర్‌ విజయశారధిరావు వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. శుక్రవారం కూటమి అభ్యర్థి కిమిడి కళావెంకటరావు, మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావులు ఆయన నివాశంలో పార్టీ కండువా కప్పి టిడిపిలోనికి ఆహ్వానించారు. గతంలో టిడిపిలో ఉన్న విజయశారధిరావు ఇటీవలే వైసిపిలో చేరారు. కాగా గద్దే బాబూరావుతో పాటు టిడిపి నాయకులు సంప్రదింపులు జరపడంతో తిరిగి టిడిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో దన్నాన రామచంద్రుడు, రౌతు కామునాయుడు, ముల్లు రమణ, గవిడి నాగరాజ తదితరులు పాల్గొన్నారు.వ్యవసాయ సలహా మండలి సభ్యులు టిడిపిలో చేరికరేగిడి: మండల కేంద్రానికి చెందిన జిల్లా వ్యవసాయ సలహా మండలి మెంబర్‌ కిమిడి నరేంద్ర నాయుడు వైసిపిని వీడి టిడిపి లో చేరారు. ఈ మేరకు శ్యాంపురం క్యాంపు కార్యాలయంలో రాజాం నియోజకవర్గం టిడిపి కూటమి అభ్యర్ధి కోండ్రు మురళీ మోహన్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసిపి సిద్ధాంతాలు నచ్చక టిడిపిలో చేరినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు కిమిడి అశోక్‌ కుమార్‌, మాజీ డిసిసిబి ఉపాధ్యక్షులు దూబ ధర్మారావు, నాయకులు పాలవలస రామచంద్రినాయుడు, బాలి రామినాయుడు, రాజాం, వంగర మండలాల నాయకులు పాల్గొన్నారు.

➡️