తగ్గిన దిగుబడులు…పాడి రైతు దిగాలు

ప్రజాశక్తి-చాపాడు వ్యవసాయం తర్వాత జిల్లా ప్రజల ప్రధాన జీవనాధారం పాడి పరిశ్రమ. రైతులు, పేద, మధ్యతరగతి ప్రజలు పాడి ద్వారా జీవనం సాగిస్తున్నారు. పాలను సేకరిస్తూ వాటిని పట్టణాల్లో అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. పల్లెల నుంచి సేకరించిన పాలను పట్ణణాల్లో ఇళ్లకు, హోటళ్లకు సరఫరా చేస్తూంటారు. పాడి పరిశ్రమను నమ్ముకుని వేలాది కుటుంబాలు జీవనోపాధిని పొందుతున్నాయి. ప్రభుత్వం ప్రతి గ్రామంలో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి పాలను సేకరించేందుకు కసరత్తు చేసి అమలు చేయలేక విఫలమైంది. ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో పాడి పరిశ్రమకు సంబంధించిన వివరాలను సేకరించి కేంద్రాలను ఏర్పాటు చేసే చర్యలు చేపట్టి పూర్తి చేయడంలో విఫలమైంది. ఆనంద్‌ మిల్క్‌ యూనియన్‌ లిమిటెడ్‌ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకొని పాల సేకరణ భవనాలు నిర్మాణానికి ఏర్పాటు చేసి పూర్తి చేయలేదు. వీటి నిర్వహణలో జాప్యం జరుగుతోంది. దీంతో పాడి పోషకులు, ప్రయివేటు వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. మహిళా సంఘాల ద్వారా పాలసేకరణ చేపట్టేందుకు గతంలో కార్యాచరణ రూపొందించి విషయం తెలిసిందే. ప్రతి ఆర్‌బికె సమీపంలో ఉపాధి హామీ నిధులతో పాల సేకరణ కేంద్రాలను నిర్మించే ఏర్పాట్లు ముమ్మరం చేసి వదిలేశారు. జిల్లాలో 633 రైతు భరోసా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటి పరిధిలో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుండి పాలను సేకరించాలని తగ్గిన దిగుబడులు(మొదటి పేజీ తరువాయి) సేకరించాలని ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ప్రయివేట్‌ పాల కేంద్రాల నుంచి రైతులకు ఎలాంటి లబ్ధి అందడం లేదు. పాడి రైతులకు ఖర్చులు పెరగడంతో ప్రభుత్వం ద్వారా పల్లెల్లో పాల ఉత్పత్తి ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోనే పాల ఉత్పత్తిలో పేరుగాంచిన చాపాడు మండలంలో ప్రస్తుతం పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గాంధీ నగరంలో పశువుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. గతంలో ఈ గ్రామం అధిక పాల దిగుబడి సాధించడంతో అనేకమార్లు అవార్డు అందుకుంది. ప్రస్తుతం ప్రభుత్వం పాల సేకరణ కేంద్రాలు లేకుండా పోయాయి. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో పాల దిగుబడి తగ్గింది. దిగుబడి తగ్గినందున పాల ధరలు పెంచాలని రైతులు కోరుతున్నారు. మైదుకూరు నియోజకవర్గ పరిధిలో పదికి పైగా ప్రయివేటు పాల కేంద్రాలు కొనసాగుతుంటే ప్రభుత్వ కేంద్రాలు ఒకటి కూడా లేదు. గత ప్రభుత్వ ఆధ్వర్యంలో డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా జిల్లాలో 17 ప్రాంతాల్లో పాల సేకరణ కేంద్రాలు కొద్దిరోజులు నడిపారు. ప్రభుత్వ పాల సేకరణ కేంద్రాలు ప్రయివేట్‌ వాటి ముందు నిలువలేక పోయాయి. ప్రయివేట్‌ పాల సేకరణ కేంద్రాల ద్వారా రైతులకు ఎలాంటి ప్రోత్సాహకం ఉండడంలేదు. గతంలో పాడి పశువులను కొనుగోలు నిర్వహణకు ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం అందించేది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాడి పరిశ్రమకు ఎలాంటి ఆదరణ లేదు. పాడి రైతుల కంటే పాల సేకరణ చేసే వారికే లాభాలు అధికంగా ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలో రోజుకు లక్ష లీటర్ల వరకు పాల సేకరణ జరుగుతోంది. పశువుల దాణ, గడ్డి రేట్లు విపరీతంగా పెరగడంతో పశువుల పోషణ భారమైంది. ఈ నేపథ్యంలో పాడి రైతుల సంఖ్య రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. 50 కిలోల పశువుల దాణా రూ.1500, ఎకరా వరిగడ్డి రూ.పదివేల వరకు అవుతోంది. ఖర్చు భరించలేక పాడి రైతులు పశువుల పెంపకం పట్ల విముఖత చూపుతున్నారు. ప్రయివేట్‌ వ్యాపారులు పాలు వెన్న శాతం ప్రకారం ధరలు నిర్వహిస్తున్నారు. వారు మాత్రం మార్కెట్లో లీటర్ల ప్రకారం ధర నిర్ణయించి కల్తీ వ్యాపారంతో కాసులు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. 1987లోనే మండల పరిధిలో ప్రభుత్వం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి గ్రామం నుంచి వేల లీటర్లు మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాల కేంద్రాలకు తరలించారు. తర్వాత కాలంలో ప్రయివేట్‌ పాల కేంద్రాల ధాటికి ప్రభుత్వ కేంద్రాలు మూత పడ్డాయి. ప్రస్తుత ప్రభుత్వం నూతన పాల సేకరణ విధానం తీసుకొచ్చి మళ్లీ పాత పద్ధతులు తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. జిల్లాలో సుమారు ఐదు లక్షల ఆవులు, పశువులు ఉన్నాయి. అధికారికంగా ప్రతి రోజూ ఆరు లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతుంది. ఇప్పటికీ జిల్లాలో పాల ఉత్పత్తులు అత్యధికంగా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని ఉన్నవి. ప్రయివేట్‌ కేంద్రాల నుంచి జిల్లాతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పాలతోపాటు మజ్జిగ ఇతర ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామాల్లో పాలను కొనుగోలు ఎప్పుడు చేస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వెన్న శాతం 10 అయితే రూ.70 లీటర్‌కు చెల్లిస్తున్నారు. వెన్న శాతం తగ్గితే రూ.40 నుంచి రూ.50మాత్రమే రైతులకు అందుతోంది. ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పాలసేకరణ కొనసాగితే కొంత సంపాదించుకోవచ్చునని పాడి రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ప్రయివేట్‌ పాల కేంద్రాల నుంచి రైతులకు ఎలాంటి లబ్ధి అందడం లేదు. పాడి రైతులకు ఖర్చులు పెరగడంతో ప్రభుత్వం ద్వారా పల్లెల్లో పాల ఉత్పత్తి ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోనే పాల ఉత్పత్తిలో పేరుగాంచిన చాపాడు మండలంలో ప్రస్తుతం పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గాంధీ నగరంలో పశువుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. గతంలో ఈ గ్రామం అధిక పాల దిగుబడి సాధించడంతో అనేకమార్లు అవార్డు అందుకుంది. ప్రస్తుతం ప్రభుత్వం పాల సేకరణ కేంద్రాలు లేకుండా పోయాయి. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో పాల దిగుబడి తగ్గింది. దిగుబడి తగ్గినందున పాల ధరలు పెంచాలని రైతులు కోరుతున్నారు. మైదుకూరు నియోజకవర్గ పరిధిలో పదికి పైగా ప్రయివేటు పాల కేంద్రాలు కొనసాగుతుంటే ప్రభుత్వ కేంద్రాలు ఒకటి కూడా లేదు. గత ప్రభుత్వ ఆధ్వర్యంలో డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా జిల్లాలో 17 ప్రాంతాల్లో పాల సేకరణ కేంద్రాలు కొద్దిరోజులు నడిపారు. ప్రభుత్వ పాల సేకరణ కేంద్రాలు ప్రయివేట్‌ వాటి ముందు నిలువలేక పోయాయి. ప్రయివేట్‌ పాల సేకరణ కేంద్రాల ద్వారా రైతులకు ఎలాంటి ప్రోత్సాహకం ఉండడంలేదు. గతంలో పాడి పశువులను కొనుగోలు నిర్వహణకు ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం అందించేది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాడి పరిశ్రమకు ఎలాంటి ఆదరణ లేదు. పాడి రైతుల కంటే పాల సేకరణ చేసే వారికే లాభాలు అధికంగా ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలో రోజుకు లక్ష లీటర్ల వరకు పాల సేకరణ జరుగుతోంది. పశువుల దాణ, గడ్డి రేట్లు విపరీతంగా పెరగడంతో పశువుల పోషణ భారమైంది. ఈ నేపథ్యంలో పాడి రైతుల సంఖ్య రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. 50 కిలోల పశువుల దాణా రూ.1500, ఎకరా వరిగడ్డి రూ.పదివేల వరకు అవుతోంది. ఖర్చు భరించలేక పాడి రైతులు పశువుల పెంపకం పట్ల విముఖత చూపుతున్నారు. ప్రయివేట్‌ వ్యాపారులు పాలు వెన్న శాతం ప్రకారం ధరలు నిర్వహిస్తున్నారు. వారు మాత్రం మార్కెట్లో లీటర్ల ప్రకారం ధర నిర్ణయించి కల్తీ వ్యాపారంతో కాసులు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. 1987లోనే మండల పరిధిలో ప్రభుత్వం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి గ్రామం నుంచి వేల లీటర్లు మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాల కేంద్రాలకు తరలించారు. తర్వాత కాలంలో ప్రయివేట్‌ పాల కేంద్రాల ధాటికి ప్రభుత్వ కేంద్రాలు మూత పడ్డాయి. ప్రస్తుత ప్రభుత్వం నూతన పాల సేకరణ విధానం తీసుకొచ్చి మళ్లీ పాత పద్ధతులు తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. జిల్లాలో సుమారు ఐదు లక్షల ఆవులు, పశువులు ఉన్నాయి. అధికారికంగా ప్రతి రోజూ ఆరు లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతుంది. ఇప్పటికీ జిల్లాలో పాల ఉత్పత్తులు అత్యధికంగా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని ఉన్నవి. ప్రయివేట్‌ కేంద్రాల నుంచి జిల్లాతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పాలతోపాటు మజ్జిగ ఇతర ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామాల్లో పాలను కొనుగోలు ఎప్పుడు చేస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వెన్న శాతం 10 అయితే రూ.70 లీటర్‌కు చెల్లిస్తున్నారు. వెన్న శాతం తగ్గితే రూ.40 నుంచి రూ.50మాత్రమే రైతులకు అందుతోంది. ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పాలసేకరణ కొనసాగితే కొంత సంపాదించుకోవచ్చునని పాడి రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు.

➡️